శ్రీరాముని రాజ్యం గురించి ఎందరో మహానుభావులు ప్రశంసల్ని ఇచ్చారు. రాముడు, రామరాజ్యం ఇవన్నీ ఎంతో మంచి పేరు పొందాయి. అయితే అసలు  సీతా రాముల కళ్యాణం ఎందుకు జరుపుకోవాలి? ఎక్కడ జరుపుకోవాలి? చైత్ర నవరాత్రి అని ఎందుకు అంటారు?ఎక్కడ కళ్యాణం చేస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనకి ఉంటాయి. అప్పట్లో మన పెద్దలు, పూర్వికులు పాటించిన పద్ధతులని, ఆచారాల్ని అనుసరించాల్సిన బాధ్యత నేటి తరంది. 

 

IHG

 

ఈ పండుగని అదే రోజు జరుపుకోవడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది రాముడు జన్మించడం, రెండవది అయోధ్యకి సీతా రాములు అరణ్యవాసం చేసి రావడమా. మూడవది ఆ రోజే వారికి  కళ్యాణం జరగడం. ఇందు మూలంగానే ఈ రోజుని ఎంతో మంచి పర్వదినంగా భావించి ఆ రోజు సీతా రాముల కళ్యాణం జరిపిస్తారు.

 

ఈ ఉత్సవాన్ని తొమ్మిది రోజులు కూడా జరుపుతారు. ఆ తొమ్మిది రోజులు కూడా భక్తి గీతాలు, రామాయణ పారాయణం వంటివి ఎన్నో చేస్తారు. ఊరేగింపు చేసి స్వామి వారిని వీధుల్లో భక్తుల నడుమ తీసుకుని వెళ్తారు. అలానే ఈ ఊరేగింపులో రంగు నీళ్ళని చల్లుకుంటూ తీసుకుని వెళ్తారు. అంతే కాకుండా  ఈ ఉత్సవం అంగ రంగ వైభవముగా జరుపుతారు.

 

IHG

 

అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ఈ వేడుకలో పాల్గొంటారు. అలానే ఈ భక్తులు స్వామి వారిని పూజించి మంచి జరగాలని కోరుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన దేవాలయాల్లో భద్రాచలం  చెప్పుకో దగ్గది. అక్కడ ఈ ఉత్సవం మిన్నంటుతుంది. అంత పెద్ద ఉత్సవం మరి మన శ్రీరామనవమి ఉత్సవం. పచ్చటి పందిర, మామిడి తోరణాలు, వేదం మంత్రాలతో ఈ ఉత్సవం బ్రహ్మండంగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: