రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రాముని కళ్యాణం జరుగుతోంది. ఏపీలో లాక్ డౌన్ అమల్లో ఉండటం, కరోనా ఎఫెక్ట్ వల్ల హంగూ ఆర్భాటాలు లేకుండా ఈ సంవత్సరం కళ్యాణం జరుగుతోంది. కళ్యాణ మహోత్సవానికి భక్తులు హాజరు కాకూడదని కొన్ని రోజుల క్రితమే ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామ పెద్దలు, అర్చకులు మాత్రమే కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కళ్యాణ వేదికను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కళ్యాణ మండపంలో ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయంలోని గర్భగుడి వెనుక భాగంలోని కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణ మహొత్సవం జరుగుతోంది. అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించే అవకాశం కల్పించారు. 

 

టీటీడీ భక్తి ఛానల్ ఎస్వీబీసీలో స్వామి వారి కళ్యాణాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరగగా ఒంటిమిట్టలో మాత్రం పండు వెన్నెల్లో ఛైత్ర పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: