దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం కూడా ఒకటి.  హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు 41 రోజుల పాటు దీక్ష చేస్తారు. కఠిన నియమాలతో దీక్షచేసి, ఇరుముడితో వచ్చి స్వామిని దర్శించుకుంటారు. 


 
అయితే సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లోనే 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది. ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. 

 

పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింద‌ట‌. ఇక ఆ త‌ర్వాత త‌ర్వాత భ‌క్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: