ప్రపంచ ప్రజల చేసిన పాపాల కోసం అతను సిలువై ప్రాణాలు అర్పించారు.. ఆ తర్వాత మూడో రోజు సమాధి నుండి లేచాడు.. పక్కవారిని ప్రేమించాలి అని.. పొరుగువారు చేసిన తప్పులను క్షమించాలంటూ అతను భూమిపై జీవించిన అన్ని రోజుల్లో ప్రజలకు బోధనలు చేసారు. అతనే జీసస్. 

 

ఇంకా క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడ్డాడు. అయితే ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ? యేసు క్రీస్తు మరణిస్తే గుడ్‌ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు యేసు మరణిస్తే శుభం ఎలా అవుతుంది..? అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నిజానికి గుడ్ ఫ్రీడే అంటే అందరూ పెద్ద పండుగలా.. ఈరోజు మంచిరోజుగా భావిస్తారు.. ఇందుకు కారణం అందులో గుడ్ అనే పదం ఉండటమే కారణం.. గుడ్ అంటే శుభం అని అర్ధం రావడంతో అందరూ అలా అనుకుంటారు.. కానీ నిజానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. 

 

జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం అని కొందరు అంటారు.. మరికొందరు బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఇంకా ఈ రోజున క్రిస్టియన్స్ అందరూ ఉపవాసం ఉండి దేవున్ని తల్చుకుంటూ ప్రార్థనలో గడుపుతారు. ఇలా గుడ్ ఫ్రైడే అని జీసస్ మరణించిన రోజును పిలుస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: