జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇక ఇందులో కొంతమంది కర్మ సిద్ధాంతం నమ్మిన వారు ఎదుర్కోవటం తప్పక గ్రహ ప్రభావమని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం భక్తులు ఏదో ఒక సమయంలో నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం నవగ్రహాల అనుగ్రహం ఉంటే అన్ని రకముల బాధలు తొలగిపోతాయని తెలుపుతుంది. కనుక వ్యతిరేకంగా ఉన్న గ్రహాలకు శాంతి చేయిస్తూ ఉంటారు పూజారులు. ఇక అసలు విషయానికి వస్తే... నవగ్రహాల ఫోటోలను పెట్టుకొని పూజిస్తే మంచిదా లేదా...? నవగ్రహాలకు నిత్య ఆరాధన చేస్తే మంచిదా అని కొందరిలో సందేహం వస్తుంది మరికొందరిలో. 

 


ఇలాంటి విషయాలు అన్నిటికీ వేద పండితులు తెలిపిన విషయాలు చూద్దామా మరి.. వాస్తవానికి శనీశ్వరుని నవగ్రహాలను ఇంట్లో అసలు పూజలు చేయకూడదని తెలియజేస్తున్నారు పండితులు. పూర్వకాలం నుంచి ఎప్పుడూ కూడా ఈశ్వరుని తోపాటు నవగ్రహాలను పూజించే సంప్రదాయం లేదు అని పండితులు వివరిస్తున్నారు. ఇక పురాతన దేవాలయాల్లో అయితే అసలు నవగ్రహాలు కూడా ఉండవని తెలుపుతున్నారు.  200 సంవత్సరాల నాటి గుడిలో మాత్రమే నవగ్రహాలు ఉంటాయని కొంతమంది పండితులు పేర్కొన్నారు.  వాస్తవానికి నవగ్రహాలు ఆ దేవదేవుడు ఆదేశించి పనులు మాత్రమే చేయడానికి ఆదేశం ఉంది. కనుక నవగ్రహాల ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే దేవ దేవుని పూజిస్తే చాలు. అంతేకానీ నవగ్రహాలను పూజించిన అవసరం లేదు అని పండితులు తెలిపారు. 

 

 

కనుక ఇంట్లో నవగ్రహాలకు పూజలు నిర్వహించవలసిన అవసరం లేదు అని అంటున్నారు.. ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకుంటే ఆగమ శాస్త్రం ప్రకారం హోమాలు నిర్వహించాక ఆ తర్వాత దీపజ్యోతిలో ఉండడంతో నవగ్రహాలను ఆవాహన చేసిన తర్వాతే నవగ్రహాలకు పూజలు చేయాలని అంటున్నారు. చాలా వరకు ఇంట్లో కన్నా దేవాలయాలలో నవగ్రహాలకు పూజలు చేసుకోవడం చాలా మంచిది అని పండితులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నవ గ్రహాల ఫోటోలు మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు అని పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: