కరోనా వైరస్.. దీని గురించి ఎంత చెప్పిన తక్కువ.. ఎంత చెప్పిన ఎక్కువ.. ప్రపంచ దేశాల ప్రజలకు ఎలా గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అగ్ర రాజ్యాలను సైతం ప్రపంచ దేశాలు కాళ్ళు పట్టించింది ఈ వైరస్. ఇంకా ఈ వైరస్ ఇప్పటికే 19 లక్షలమందికిపైగా వ్యాపించింది. ఇంకా అందులో లక్ష 25 వేలమంది ప్రాణాలను విడిచారు. 

 

అయితే ఈ కరోనా వైరస్ నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుండే లాక్ డౌన్ అమలు చేస్తూ వచ్చింది. మొదట 21 రోజులు లాక్ డౌన్ చెయ్యగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గటపోవడంతో మే 3వ తేదీ వరుకు లాక్ డౌన్ పొడిగించారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ కరోనా కారణంగా ఒక్క ప్రజలే కాదు దేవుళ్ళు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.. నిన్నటితో మొదటి దాప లాక్ డౌన్ పూర్తయ్యింది. అన్ని బాగుంటే ఈరోజు ఏలాంటి లాక్ డౌన్ ఉండేది కాదు.. కానీ లాక్ డౌన్ మళ్లీ పొడిగించారు. దీంతో తిరుమల శ్రీవారి దర్శనలకు నేడు మళ్లీ బ్రేకులు పడ్డాయి. 

 

మే 3 వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేవలం తిరుమల శ్రీవారి దర్శనాలే కాదు.. టీటీడీ అనుబంధంగా ఉన్న ఆలయాలన్నింటిలో కూడా భక్తులకు దర్శనాలను రద్దు చేస్తున్నాం అని అయన తెలిపారు. ఇలా దేవుడికి సైతం కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. మరి ఈ కరోనా బారి నుండి మనం ఎప్పుడు తప్పించుకుంటాం అనేది దేవుడికే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: