సాంప్రదాయాలు, దైవాలు మరియు ఆచార వ్యవహారాల పేర్లతో వివిధ తెగలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న భారతీయులకు - 'అన్ని మతాలు ఒక్క వేదమతంలో నుంచి ఉద్భవించాయని, అందులో భూతద్దం పెట్టి జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమీ లేదని' చెప్పే శక్తి (వ్యక్తి) కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువులకు పుట్టింది. ఆ వ్యక్తే ఆది శంకరాచార్యులుగా ఖ్యాతిగడించిన సద్గురువు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ పట్టణానికి 75 కి.మీ. దూరంలో ఉన్న కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లాలో ఉన్నది. శ్రీ శంకరులు కేరళలో కాలడి అనే గ్రామము లో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబము లో శివగురువు,ఆర్యామ్బ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించగా, తల్లి ఆ బాలుడుకి ఐదో ఏట ఉపనయనం చేయించింది .

 

ఆ తరువాత శంకరులు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి, మూడు సంవత్సరాలు సాంగోపాంగంగా వేదాలు నేర్చుకున్నారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఆ చిన్న వయసులోనే అందరూ ఆ బాల శంకరుల ప్రతిభ చూసి, ఆయనని భగవంతుని అవతారమని భావించేవారు.  ఈ గ్రామం పెరియార్ నదికి సమీపంలో ఉన్నది. ఇక్కడి నుండే శంకరాచార్యులు కాలినడకన దేశమంతటా తిరిగి నాలుగు పీఠాలను స్థాపించారు. శంకర నారాయణ దేవాలయం కాలడికి 3 కి.మీ. దూరంలో ఉంది. ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివునిలో కలిసిపోయి శివ కేశవులకు భేదంలేదని రుజువుచేశాడు.

 

ఇక్కడ ముందు శివుడికి తర్వాత విష్ణువుకు అర్చన నిర్వహిస్తారు. అద్వైత తత్వాన్ని ప్రభోదించి ఈ దేశపుటెల్లలు దాటి అవతలకి పోయేట్టు నాస్తిక వాదులను తరిమి కొట్టారు.. ఈ ఆధునిక వాహనాలు, రోడ్లు ఏమీ లేని రోజుల్లో కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా పర్యటించి ఈ జాతి జీవన విధానాన్ని మార్చిన మహనీయులు..మనపై కరుణతో ఆ శివుడు స్వయముగా దిగివచ్చిన అవతారం...శంకర భగవత్పాదులు! ఇలాంటి పవిత్రమైన రోజున మనము అందరమూ ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన మనకి అందించిన అపూరూపమైన ఆస్తులు... శబ్ద సౌందర్యముతో కూడిన స్తోత్రాలు... పఠిస్తూ...హర హర శంకర జయ శంకర !

మరింత సమాచారం తెలుసుకోండి: