ఫిత్రా అనగా ముస్లింలు రంజాన్ పండ‌గ‌కు ముందు ఇచ్చేదానాన్ని ఫిత్రా అంటారు. అంటే వారి ఇళ్ళ‌ల్లో ఉండే ప్ర‌తి దానికి లెక్క‌గా దానాన్ని ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌, బియ్యం నుంచి ప‌ప్పు, ఉప్పు నుంచి ఇలా మ‌నం దేనినైతే తింటామో అన్నిటి మీద కొంత డ‌బ్బు లేదా వ‌స్తువుల రూపంలో దానాన్ని ఇస్తారు. ఇస్లాం ప‌ద్ధతి ప్ర‌కారం ఈదుల్ ఫిత‌ర్ అన‌గా రంజాన్ పండుగ‌కి ఈ దానాన్ని ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. 

 

ఈ దానాన్ని ఈదుల్ ఫిత్ర్  అంటారు. పండుగకు ముందు ఆహారధాన్యాల నుండి (బియ్యం, గొధుమలు మొదలగు వాటి నుండి) ఒక “సా” (3 కేజీలు) బీద ముస్లింల‌కు దానం చేయుట. దీనిని చేయ‌డం వ‌ల్ల ఉపవాస స్థితిలో జరిగే చిన్నచిన్న తప్పులకు పరిహారము వంటిది. మ‌నం దేనినైతే తింటాము దాన్ని మాత్ర‌మే దానం చేయాలి. వాళ్ళ‌కు త‌క్కువ ర‌కం ఇచ్చి మ‌నం వేరే ర‌కం తిన‌డం అలాంటివి చేయ‌కూడ‌దు. 

 

హదీథ్ లలో ఈ విధముగా తెలుపబడినది: ఇది ఉపవాసి యొక్క చిన్నచిన్న పొరపాట్లను దూరము చేస్త‌ది మ‌రియు బీదవారు కూడా అందరితో కలిసి పండుగ జరుపుకోవాల‌నే ఉద్దేశంతో ఈ ఫిత్రా దానాన్ని చేస్తారు. మరియు అల్లాహ్ కు కృతజ్ఞ‌తలు తెలుపుకోవడానికి – ఎవరైతే మనచేత రమదాన్ నెల ఉపవాసములు పూర్తి చేయించి ఇస్లాం యొక్క ఒక మూల స్థంభము పై అమలు చేసే శక్తిని మనకు ప్రసాదించాడో.

 

ఎవరిపై ఈ ఫిత్రా విధి చేయబడినది: ‘ప్రతి ఒక్కరిపై’ అనగా అప్పుడే పుట్టిన శిశువునుండి, పెద్దవారి వరకు, మరియు బానిసల తరఫు నుండి, అందరి తరఫు నుండి ఆ ఇంటి పెద్ద ఈ  ఫిత్రాను దానము చెల్లించాలి.“అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ముస్లిం పై, స్వతంతృడుగాని, బానిసగానీ, పురుషుడుగాని, స్త్రీ గానీ, పిల్లలు గానీ, పెద్దవారుగానీ, అందరిపై ఒక ‘సా’ గోధుమలు లేదా ఒక ‘సా’ బార్లీ దానముగా తీయుటను విధిగావించిరి.” 

మరింత సమాచారం తెలుసుకోండి: