హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు కూడా ఒక‌టి. వాయుదేవుని కుమారుడు వానర యోధులలో ముఖ్యుడు అయిన వాడు ఈ హనుమంతుడు. హ‌నుమంతుడు మ‌హా ప‌రాక్ర‌మ‌వంతుడు.. అప‌జ‌య‌మే ఎరుగ‌నివారు. అందుకే హనుమంతుని ఆరాధిస్తే బలం, వర్చస్సు, మంచి వాక్కు, బద్ధకం నుంచి విముక్తి, కోరిన కోర్కెలు తీరడం వంటివి సిద్ధిస్తాయ‌ని అంటుంటారు. దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేక‌త‌ ఉంటుంది. అలాంటి వాటిలో సికింద్రాబాద్ - బోయినపల్లి సమీపంలోని శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం కూడా ఒక‌టి.

 

త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. అందుకే జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించార‌ట‌. ఇక తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడమని మహర్షి వినాయకుడిని ప్రార్ధించాడట. అందువలన ఇక్కడ ఆంజనేయుడితో సహా వినాయకుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. అయితే 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో.. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. 

 

ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఇక్కడ వెలసిన ఆంజనేయస్వామిని మహాశక్తివంతుడు అని ఎందుకు అంటారంటే.. రామాయణ కాలంలో జాబాలి మహర్షి మూడు ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించగా అందులో ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మొదటిదిగా చెబుతారు. ఇక  రెండవ విగ్రహం హృషీకేశ్ లో ఉండగా, మూడవ విగ్రహం తిరుపతి లో ఉంది. జాబాలి మహర్షి తన తపస్సు ని అంత ధారబోసి ప్రతిష్టించిన ఈ మూడు క్షేత్రాలను కలిపి జాబాలి క్షేత్రాలని అంటారు.  అందుకే ఇక్కడి ఆంజనేయస్వామిని మహాశక్తివంతుడు అని అంటారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే... హనుమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: