చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో .. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతి రోజూ 20 - 30 వేల మంది భక్తులు, సెలవుదినాలలో 30 -50 వేల మంది భక్తులు వేంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు ప్రసిద్ది పొందిన సంగతి తెలిసిందే.

 

11 దర్శనాలు చేసుకుని కోరిక కోరిన వారు..అది నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేస్తారు.అయితే రద్దీ దృష్ట్యా ఈ 11, 108 ప్రదక్షణలను పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాదు.. గర్భగుడిలోని ఈ రోజు అనుమతించరు. మహాద్వారం నుంచే దర్శనాలు కొనసాగిస్తారు.  కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు.  ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లివచ్చేవాడట. అయితే, కొంత కాలానికి ఆయన జబ్బుపడి తిరుపతికి వెళ్లలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వరస్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట.

 

వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.  చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పశ్చాత్త్య దేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బందిపడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి స్వామి వారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: