తిరుమల లడ్డూ.. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. ఒక‌వేళ చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు. అందువల్ల తిరుమల లడ్డూ కావాలంటే తిరుమలకు వెళ్లాలి. 

 

ఇప్పుడు మాత్రం టీటీడీయే భక్తుల చెంతకు లడ్డూను తేవడం ద్వారా... అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దేవాలయాలు సహా ప్రతి సంస్థ గత రెండు మూడు నెలలు మూతపడ్డాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధన్యత ఉన్న ఆలయం. దీంతో టీటీడీ యాజమాన్యం శ్రీవారి లడ్డులను భక్తులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. తాజాగా హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని బాలాజీ భవన్‌లో ఇవాళ్టి నుంచి లడ్డూలు అమ్ముతున్నారు. 

 

అయితే లడ్డూల కోసం వచ్చే భక్తులు మాస్కులు ధరించాలి. దూరం దూరం పాటించాలని మనకు తెలుసు. ఇక మొదటిరోజు 10 వేల లడ్డూలు అమ్మాలని నిర్ణయించారు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. లడ్డూ ధరను రూ.50 నుంచి 25 రూపాయలకు తగ్గించారు.  ఎవరికైనా ఎక్కువ లడ్డూలు కావాలంటే... ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇందుకోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ (మొబైల్ నంబర్ 9849575952), ఆలయ పేష్కార్‌ శ్రీనివాస్‌ (మొబైల్ నంబర్) 9701092777)కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే టీటీడీ  కాల్ సెంట‌ర్ టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333 కు కాల్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు. కాగా, ఇప్ప‌టికే ఏపీలో అమ్మ‌గా.. తిరుమలకు వెళ్లకపోయినా... స్వామి ప్రసాదం దక్క‌డంతో ప్ర‌జ‌లు ఆనందం వ్యాక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: