ఇప్పటివరకు మీసేవ ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్ లోనే భక్తులు ఆలయ దర్శనాలకు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి నేరుగా ఏపీ లోని గ్రామ సచివాలయం లోనే బుక్ చేసుకునే అవకాశం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది. గ్రామాలలో ఉండే భక్తులు పట్టణాలకు వెళ్లి లేదా ఇతర ప్రాంతాలకు పోయి ఇబ్బందులు పోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలకు అదనపు ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా కలిసి వస్తుందని ప్రముఖులు తెలియజేస్తున్నారు. గ్రామంలోని ఆన్లైన్ దర్శనాలు బుక్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల.. అదనపు శ్రమ తగ్గుతుంది అంటూ వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 


ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ దేవాలయాలకు వెళ్లేందుకు భక్తులు అక్కడ ఉండటానికి కావలసిన అదే గదులను గ్రామ వార్డు సచివాలయం లోనే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయలైన శ్రీకాళహస్తి ,అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల దేవాలయాలకు సంబంధించిన స్వామి వారి సేవా టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది. ఇక సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ వార్డు వాలంటీర్లు వారికి తెలిసిన వారి అందరికీ వాట్సాప్ మెసేజ్ రూపంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.

 


ఇక ఇదే తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం జూన్ 8వ తేదీ నుంచి అన్ని ఆలయాల్లో దర్శనాలు తిరిగి మొదలు పెట్టేందుకు మద్దతు ఇవ్వడంతో అన్ని దేవాలయాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా లాక్ డౌన్ రూల్స్ ను పాటు దర్శనం  సులువుగా చేసుకునేందుకు ఆ ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో మొత్తం 540 సర్వీసులు భక్తులకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. అలాగే సచివాలయం ద్వారా సేవలు పొందవచ్చు అని రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి వాట్స్అప్ ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు. అంతేకాకుండా వాలెంటరీలు కూడా తమ కుటుంబాలకు సంబంధించిన వారే అందరిని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వారికి సమాచారం అందజేస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూపు లో గవర్నమెంట్ పథకాలతో పాటు ప్రతి సమాచారం కూడా అందరికీ తెలియజేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: