శబరిమల అని పిలిచే ఈ ప్రాంతం కేరళలో ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రం. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు జ్యోతి స్వరూపుడు హరిహరసుతుడు, శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. నియమ నిష్టలతో అయ్యప్ప దీక్ష చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్షగా పేర్కొంటారు. 

 

41 రోజులపాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యం శరణు ఘోషతో పూజిస్తారు. రోజులో ఒకసారి భిక్ష, మరోసారి అల్పాహారం, రెండు సార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించడం వంటి కఠిన నియమాలు పాటిస్తారు. ఇక దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమ నిష్ఠలతో పూర్తిచేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు. కొందరు స్వాములు దీక్ష మొదలుపెట్టిన రోజు నుంచి 41 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి సంకల్పాలు, కోరికలు నెరవేరుతాయని బాగా న‌మ్ముతారు.

 

అయితే అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్లే ముందు ఇరుముడితో బయల్దేరుతారు. అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్లే ముందు ఇరుముడితో బయల్దేరుతారు. ఇది చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరి కాయలు, వక్కలు, తమల పాకులు, నాణేలు, పసుపు, గంధం పొడి, విభూది, పన్నీరు. బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం లేదా అరటిపండ్లు, కలకండ, అగరవత్తులు, కర్పూరం, మిర్యాలు, తేనే, ఎండు ద్రాక్ష, తువ్వాలలు పెట్టుకుంటారు. ఇరుముడి కట్టుకునే ఉత్సవాన్ని కెట్టు నీర లేదా పల్లికెట్టు అంటారు. ఇక‌ కొబ్బరి కాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో పద్దునెట్టాంబడి ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: