సాధారణంగా భక్తుడు గుడికి వెళ్లగానే భగవంతుడిని దర్శించుకుని దండం పెట్టుకొని ప్రదర్శనాలు మొదలుపెడతారు. అయితే అలా చేయడం తప్పని శివపురాణం తెలియజేస్తుంది. మనిషి జీవితంలో అవసరతలు తీరాలని కొన్ని శాపాలు దోషాలు పోవాలని చాలామంది గుడిలోకి వెళ్లడమే ప్రదక్షణాలు మొదలుపెడతారు. ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి గుడి చుట్టూ తిరుగుతారు. అలా మళ్లీ ధ్వజస్తంభం దగ్గర వచ్చాక మొదటి ప్రదక్షిణగా లెక్కగడతారు. అయితే ప్రదక్షిణలు చేసే టైం దానికో లెక్క ఉంటుంది అంటూ ఇటీవల కొన్ని బయటపడ్డాయి.

 

అదేమిటంటే మొదటి ప్రదక్షిణం చేసిన టైములో వేదాంత పరంగా మనషులు తమలోని తమోగుణాన్ని వదిలివేయాలి. రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలి వేయాలి మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలి వేయాలి. తర్వాత దేవాయలంలోకి వెళ్లి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించుకోవాలి. అనేది అసలు పరమార్థం. దేవుని దేహమే దేవాలయంగా మనలోని షట్‌చక్రాలను దాటి హృదయంలోని దేవుడ్ని దర్శించాలనేది కాలాంతరంలో సాధించాలనేది వేదాంత పరమార్థం.ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేయడం తప్పనిసరి. 

 

ఏయే దేవాలయాల్లో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి?

– ఏ దేవాలయంలోనైనా కనీసం మూడు తప్పనిసరి.

– నవగ్రహాలకు కనీసం మూడు. దోషాలు పోవడానికి కనీసం తొమ్మిది. ఇక ప్రదక్షిణం చేసేవారి జాతక/గోచార పరంగా ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాలి.

– ఆంజనేయస్వామి దేవాలయంలో సాధారణంగా మూడు. గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9/11, భయం, రోగం, పీడలు, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21/40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి.

– శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వరప్రదక్షిణ చేయాలి.

అమ్మవారి దేవాలయంలో కనీసం మూడు/తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

– వేంకటేశ్వరస్వామి/బాబా, గణపతి దేవాలయాల్లో కనీసం మూడు/ఐదు, తొమ్మిది, పదకొండు ప్రదక్షిణలు చేయాలి.

 

ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతునిమీద మాత్రమే తప్ప కోరిక/ఇతరత్రా విషయాలపై ఉండకూడదు.

– సాధరణమైన, పరిశుభ్రమైన వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి.

– వేగంగా, పరుగు పరుగున ప్రదక్షిణ చేయకూడదు.

– చాలా నెమ్మదిగా దైవనామ/ఓం కారం లేదా ఆయా దేవాలయంలో ఉన్న మూల విరాట్ నామస్మరణతో (మనసులో) పక్కవారిని తాకకుండా, వేరే ముచ్చట్లు పెట్టకుండా ప్రదక్షిణలు చేయాలి.

– ఇక ఆలస్యం ఎందుకు ఆయా కామితార్థాలను పొందడానికి భగవంతున్ని భక్తితో ప్రదక్షిణలు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: