జూన్ 11 నుంచీ తిరుమల గుడి తెరుస్తారు అనే వార్త ఇప్పుడు శుభవార్త లాగా ఏపీ - తెలంగాణా మొత్తం మారు మొగుతోంది . ఎన్నో దశాబ్దాల తరవాత భక్తులకి దర్శనం లేకుండా గుడి మూసి ఉండడం ఇదే చూస్తున్నాం అందరం. స్వామి వారికి నిత్య కృత్యాలు జరుగుతూ ఉన్నా భక్తులు లేకపోవడం పాపం ఆయనకి కూడా బెంగపడే విషయమే. అయితే స్వామి వారికి సంబంధించి న మెనూ గురించి మనకి కొత్త విషయం తెలుస్తోంది.. అతి తక్కువ మందికి  మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారిప్రధాన అర్చకుడు శ్రీ రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే పుస్తకం రాశారు. 

 

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన  తర్వాత అప్పుడే తీసిన  చిక్కని వెన్న నురుగుతేలే ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత  నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం  నైవేద్యంగా పెడుతారు. ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు.  దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. ఆ వెంటనే సర్వ దర్శనం మొదలు అవుతుంది. అష్టోత్తరశతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్ళీ కొద్ది సేపటికి సర్వ దర్శనం షురూ .. సాయంత్రం సమయం లో గర్భ గుడి మొత్తం శుభ్రం చేసి స్వామి వారిని పూలతో అలంకరిస్తారు. 

 

అష్టోత్తరశతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అర్ధరాత్రి పూట తిరువీశం పేరుతో బెల్లపు అన్నం పెడతారట . ఏకాంత సేవ సమయం లో నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు పెడతారు. వాటితో పాటు వేడివేడి పాలు , వాటి పక్కనే కోసిన తాజా పండ్ల ముక్కలు కూడా పెడతారట .. స్వామి మీద ప్రేమతో ఇవన్నీ ప్రత్యేకంగా చేయిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: