తిరుమలలో ఏడుకొండల మీద ఉన్న దేవ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి మీ కోసం చాల విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ... అసలు దేవదేవుడికి నేవైద్యం పెట్టేది ఇలా...  ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో పూర్తిగా శుద్ధి చేస్తారు. గాయత్రీ మంత్రం జపిస్తూ వారు నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో మాత్రమే దేవుడి ముందర పెడతారు. స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో అక్కడే ఉంటారు. దేవుడి గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు, గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ఆ ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులను చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తగిలించి, నోటి దగ్గర తగిలిస్తారు. అది ఎలా అంటే స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట. పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం చేస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే కదా. ఇక అదే విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని స్వామి వారికీ సమర్పిస్తారు.


అంతే కాకుండా నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా అర్చకులు దీనిని భావిస్తారు. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం అందిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం ఇస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు ఉంటుంది. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా ఆ శాస్త్రంలో నిర్దేశించారు. అయితే ఈ నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ఇక ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు దేవుడికి.

మరింత సమాచారం తెలుసుకోండి: