ఈ కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం.  తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ, శ్రీవారు అని ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. ఇక స్వామి వారి నామాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు సకల సుఖాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్థాయి. 

 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే..  శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే పుస్తకం రాశారు. ఇందులో శ్రీ‌వారి గురించి ఎన్నో విష‌యాలు ఉన్నాయి. అందులో శ్రీ‌వారి మెనూ కూడా ఉంది. ఈ పుస్త‌కం ప్ర‌కారం.. ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ ఉంటుంద‌ట‌. ఆ వివరాలు మీకోసం.. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. 

 

ఉదయం బాలభోగం:
మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి ఉదయం బాలభోగంలో స్వామివారికి నైవేద్యంగా పెడ‌తారు.

 

మధ్యాహ్నం రాజభోగం
శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం మధ్యాహ్నం రాజభోగంలో స్వామివారికి నైవేద్యంగా పెడ‌తారు.

 

రాత్రి శయనభోగం
మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం) రాత్రి శయనభోగంలో స్వామివారికి నైవేద్యంగా పెడ‌తారు.

 

ఇక ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. అలాగే మ‌రోవిశేషం ఏంటంటే..  ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించర‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: