తిరుమలలో ఏడుకొండల మీద ఉన్న దేవ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఎలాంటి నైవే‌ద్యాలు అందిస్తారో వాటి గురించి మీ కోసం చాలా విషయాలు ఇప్పుడు ఓసారి తెలుసుకుందామా...?  అసలు ఎన్ని విధాలుగా ఎన్ని రకాల  నైవేధ్యాలని దేవుడికి అందిస్తారో తెలుసుకుందామా ...! 

 


దేవదేవుడికి ఉదయం బాలభోగం సమయంలో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి దేవుడికి అందచేస్తారు. ఇక అలాగే మధ్యాహ్నం రాజభోగం సమయంలో దద్యోజనం, శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, శీర లేక చక్కెరన్నం దేవుడికి అందచేస్తారు. అలాగే రాత్రి శయనభోగం సమయంలో మరీచ్య అన్నం (మిరియాల అన్నం), దోసె, లడ్డు, వడ, శాకాన్నం (వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం) తో పాటు అల్పాహారాలు లడ్డు, వడ, అప్పం, దోసె స్వామి మెనూ ఇలా ప్రతి రోజు స్వామి వారికీ సకాలంలో చేస్తారు.

 

 

ఇక పోతే ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు స్వామికి సమర్పిస్తారు. ఆ తర్వాత తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా వారికి పెడుతారు. ఇక ఆ తరువాత బాలభోగం స్వామివారికి సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది స్వామి వారికి. ఇక ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది భక్తులకి. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ ఇవ్వడం జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం యధావిధిగా మొదలవుతుంది. ఇక అలాగే సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో ఆలయం మొత్తం అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం అందిస్తారు. ఇక అంతటితో అయిపోయినట్టు అనుకునేరు ... అర్ధరాత్రి తిరువీశం పేరుతో మళ్ళీ బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) స్వామి వారికి సమర్పిస్తారు. ఇక పవళించే సమయం స్వామివారికి ఆసన్నం అవుతుంది. ఇక ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి అప్పుడు అందచేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: