పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాలలో మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో మరియు ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారుచేయబడతాయి. కాని ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉండ‌టం గ‌మ‌నార్హం. అదే విగ్రహాల‌ను ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతారు.  ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండలలో వండుతారు. ఇత దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయాన్ని సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది. ఆలయంలో చెక్క విగ్రహాల ప్రతిష్ట వెనుక అనేకానేక పురాణగాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 


ఒక కథనం ప్రకారం, ఉజ్జయిని పాలకుడైన ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు కలలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రంలో తేలియాడుచున్న వేపమానుతో జగన్నాథుని రూపంలో తన విగ్రహాన్ని చేయించమని కోరాడట. విగ్రహాలను చెక్కడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు. కాని తాను విగ్రహాలు చెక్కినపుడు ఎవరు లోపలికి రారాదని తలుపులు మూసుకున్నాడు. పదిహేను రోజులైనా శిల్పి బయటకి రాకపోవడంతో, అన్నపానీయాలు లేక ఆయన ఎక్కడ షుశ్కించిపోతాడో అని భావించి, రాజమాత ఆదేశానుసారం తలుపులు తెరవగా, విగ్రహాలు అసంపూర్తిగా దర్శనమిచ్చాయి. శిల్పి అదృశ్యమైనాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శిల్పిగా వచ్చాడని భావించి, అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే రాజు ప్రతిష్టించాడని ప్రతీతి. అవయవ లోపం కలిగిన విగ్రహాలు అర్చనకు అనర్హం అని అంటారు. కానీ ఈ ‘నీలాచలం’ క్షేత్రంలో అదే ప్రత్యేకత. పూరీ జగన్నాథుడి రూపం దైవం చెక్కిన దారుశిల్పం.


జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ నిర్మించగా, ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవి పునర్నించాడని తెలుస్తోంది. ఆలయం మొత్తం కళింగ శైలిలో నిర్మితమైనది. పూరీ ఆలయం నాలుగు ల క్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబ డింది. సుమారు 120 ఉపాలయాలు ఉన్నాయి. అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశలోని అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలో విష్ణువుకు చెందిన ‘శ్రీచక్ర’ ఎనిమిది ఆకుల చక్రంగా నిర్మించబడింది. దీనినే ‘నీలిచక్ర’ అనికూడా అంటారు. ధ్వజస్తంభం ఎత్తైన రాతి దిమ్మపై నిర్మించబడింది. ఇది గర్భగుడి కన్నా ఎత్తులో ఉంటుంది. తూర్పు ముఖంగా ఉం డే ఆయల ముఖ ద్వారాన్ని సింహ ద్వారం అంటారు. మిగిలన మూడు పక్కల ఉన్న ద్వారాలని ‘హాథీ ద్వారా’ (ఏనుగు), ‘వ్యాఘ్రద్వార'(పులి), ‘అశ్వద్వారస‌లుగా పిలుస్తారు. ప్రధానమైన సింహద్వారం ‘బడోదండో’ గా పిలిచే పెద్ద వీధికి దారి చూపుతుంది. ‘బాయిసిపవచ’ అంటే 22 మెట్లు ఆలయ ముఖ ద్వారానికి దారి చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: