అమరావతిలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు శాకాంబరి దేవిగా  దర్శనమిచ్చింది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలు మల్లిఖార్జున మండపంలో  ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉత్సవాలను ఆలయ ఈవో సురేశ్‌బాబు, వైదిక్‌ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు.  ఉత్సవాల్లో భాగంగా పలువురు ముఖ్య ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.  శుక్రవారం ఉత్సవాలను ఆలయ ఈవో సురేశ్‌బాబు, వైదిక్‌ కమిటీ సభ్యులు ప్రారంభించారు.

 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. తొలిరోజు  గుంటూరు మార్కెట్‌ యార్డు, ఆకు కూరల సంఘం, నూజివీడు రైతులు అలంకరణకు 4500 కిలోల కూరగాయలను, పండ్లను  ఆలయానికి అందజేశారు. సుమారు వందమంది మహిళలు  వాటిని దండలుగా కట్టడంతో రాజగోపుల ప్రాంగణం, దుర్గమ్మ ప్రధాన ఆలయం, ఉపాలయాల్లో వీటిని అలంకరించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్‌మిస్‌, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించనున్నారు.

 

అమ్మవారిని దర్శించుకునేందుకు గాను ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ పొందిన భక్తులకు మాత్రమే అనుమతించారు.  గత మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. ఇటీవల మళ్లీ దేవాలయాలు పునఃప్రారంభించారు. భక్తులు నియమనిబంధనలు పాటించాలని.. గుళ్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని ఆలయాధికారులకు సూచించింది ప్రభుత్వం. అలాగే భక్తులు కూడా గుంపులు గుంపులుగా రాకుండా ఓ పద్దతి ప్రకారం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ లు ధరించి పరిశుభ్రతను పాటించాలని నియమ నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: