మన దేశంలో చాలా మంది హిందువులు నలుపు రంగును ఇష్టపడరు. అయితే నల్లదారాన్ని కట్టుకునేందుకు మాత్రం ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ఈ నల్లదారాన్ని పాదం పై భాగంలో, మెడ, నడుము లేదా మణికట్టు చుట్టూ కట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పూర్వం మన పెద్దలు కూడా వీటిని నమ్మేవారట. ఇదే సంప్రదాయాన్ని ఇప్పటికీ చాలా మంది హిందువులు ఆచరిస్తున్నారు. ఈ నల్లదారాన్ని పవిత్రమైనదిగా నమ్ముతున్నారు. ఇది తమను ప్రతికూల శక్తి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ నల్ల దారాన్ని స్టైలిష్ గా కనిపించేలా ధరిస్తున్నారు.

 మరికొందరు దీని వల్ల తమకు లక్కీ కూడా కలసి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. నల్లదారం ధరించడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా నల్లదారం ధరిస్తే పైవన్నీ జరుగుతాయా? లేక ఇది మూఢనమ్మకమేనా అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. నల్లదారాన్ని ధరించే ముందు దానిని శని మరియు హనుమంతులకు అర్పించాలి. దీని వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.  పవిత్రమైన ముహూర్తాల్లో మాత్రమే ఈ దారాన్ని ధరించాలి. లేకపోతే దీని ప్రభావం అంతగా ఉండదు.  శనీశ్వరుని నుండి ఆశీర్వాదం కోసం ధరిస్తారు.

ఇతరుల నుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దూరంగా ఉండేందుకు ఈ దారాన్ని ధరిస్తారు. ఈ నల్ల దారాన్ని ధరించిన తర్వాత గాయత్రి మంత్రం జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఇప్పటికే మీరు మీ మణికట్టు మీద పసుపు, ఎరుపు లేదా కుంకుమ దారం ధరించి ఉంటే అలాంటి చేతుల్లో నల్లటి దారం ధరించకూడదు. నల్లదారం శనిని సూచిస్తుంది. కాబట్టి గ్రహాల కదలికను మరియు దశను (గ్రహ పాలన యొక్క కాలాలు) విశ్లేషించిన అనంతరమే ఈ దారాన్ని ధరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: