భారతదేశంలో ఉన్నన్ని సంప్రదాయ ఆచార వ్యవహారాలు మరే హిందూ దేశంలో ఉండవని తెలిసిందే. ఎన్నో పాశ్చాత్య దేశాలు మన పద్ధతులను పాటిస్తున్నాయంటే నమ్మండి. ఇప్పుడు అయినా కొంత మేరకు హిందూ ఆచార వ్యవహారాలు పాటించడం తగ్గింది కానీ, పూర్వం అయితే చాలా కఠినమైన ఆచార వ్యవహారాలు పాటించేవారు. పుట్టిన దగ్గరనుండి మరణించే వరకు ప్రతి ఒక్క కార్యక్రమం తప్పకుండా ఒక పద్దతి ప్రకారమే చేసేవారు. పూర్వ కాలంలో ఇవన్నీ పాటించే వారు కనుకే, వారు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు.

హిందూ సంప్రదాయంలో భాగంగా ఎంతోమంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు. దేవుని గుడిలో పూజ కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిన తరువాత, ఆ గుడి పూజారి భక్తులకు ప్రసాదాన్ని లేదా దేవుడి తీర్ధాన్ని ఇవ్వడం పరిపాటి. ఈ సందర్భంలో మీరు బాగా గమనిస్తే గనుక తీర్ధాన్ని ఒక రాగి చెంబులో ఉంచి, అందరికీ అందులో నుండి పంచుతారు. ఇదే విధంగా మన ఇంటిలో కూడా పూజ గదిలో స్వామి వారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి...? మరే చెంబు అయినా పెట్టొచ్చు కదా అనే సందేహం మీకు కలగవచ్చు...! దీనికి గల కారణాన్ని పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్పేవారట. అంతే కాకుండా ఇలా దేవుని ముందు ఉంచిన చెంబులో నీటిని ఒక మంత్రాన్ని పఠించి తాగడం వలన సర్వ రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఇలా రోజూ దేవుని ముందు ఉంచిన నీటిని ఒకవేళ మిగిలిపోతే ఎవ్వరూ ఈ నీటిని కాలితో తొక్కని చోట చెట్లకు పోయాలి. ఈ విధంగా చేయడం వలన మన ఇంట్లో ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: