మనము ఏ శివుని ఆలయంలోకి అడుగు పెట్టగానే శివుని కంటే ముందుగా ఆ నందీశ్వరుడునే దర్శించుకుంటాము. కొందరు ఆ నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. ఇలా చేయడం వలన భక్తుల మనసులోని కోరికలు నెరవేరుతాయని వారి గట్టి నమ్మకం. అయితే నందీశ్వరుడికి ఎందు ఇంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా...అయితే మీరు ఈ కథను తెలుసుకోవలసిందే అంటున్నాయి పురాణాలు. పూర్వం శిలాదుడనే ఒక ఋషి ఉండేవాడు. ఈయనకు ఉన్న జ్ఞానానికి, సంపదకు మరియు గౌరవానికి  అయితే కొదువ లేదు కానీ సంతానం మాత్రం కలుగ లేదు. దీనితో ఈయన చాలా దుఃఖంలో ఉండేవారు.

ఆ సమయంలో సంతానం కోసం మహాశివుని కోసం తపస్సు చేశాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కళలు మారిపోయాయి కానీ శిలాదుడు మాత్రం తన తపస్సును ఆపలేదు. దీనితో ఆ మహాశివుడు శిలాదుని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇచ్చిన వారంతో బాలుడి యజ్ఞంలో నుండి ఉద్భవిస్తాడు. ఆ బాలుడికి 'నంది' అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. పేరుకు తగినట్లుగానే నంది తెలివి తేటలు అమోఘం. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆ దేవతలు ఆ నంది అనే బాలుడుని చూసి చాలా మురిసిపోయారు. పెదాలయందు తనకున్న గౌరవం మరియు అతిధి మర్యాదలకు వారు మిక్కిలి సంతోష పడ్డారు.

అయితే వీరు పోతూ పోతూ ఆ పిల్లాడిని చూసి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోతూ ఆగారు... ఇది గమనించిన శిలాదుడు ఏమని అడుగగా, వారు చెప్పిన మాట విని దుఃఖంలో మునిగిపోయాడు. అది ఏమిటంటే నంది ఆయుస్సు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు. కానీ నంది మాత్రం ఎటువంటి భయం లేకుండా, పుట్టించింది శివుడే కాబట్టి ఆయనే దీనికి మార్గం చూపిస్తాడు అంటూ తపస్సు మొదలుపెట్టాడు. ప్రత్యక్షమయిన శివుడు ఏమి కావాలో కోరుకో మంటాడు. అప్పుడు నంది ఎప్పుడూ నీ పాదాల చెంతనే ఉండేలా ఆశీర్వదించు నాటాడు. అందుకే నంది వృషభం రూపంలో శివుని చెంతనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: