1. గర్భవతులు దేవాలయానికి వెళ్ళకూడదా..?
గర్భవతులు ఏడవ నెల వచ్చిన తర్వాత ఆలయాలకు వెళ్ళకూడదు. ఆరోగ్యరీత్యా మంచిది కాదు. అందుకే మన పూర్వీకులు గర్భవతులు ఆలయ ప్రవేశం చేయకూడదని చెప్పినారు.            

2. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరికాయను కొట్టి కూడదా.?
 శాస్త్రం ప్రకారం ఆ విధంగా చేయకపోవడం మంచిది. ఎందుకు అనగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నెల వచ్చిన పిదప కడుపులో  పిండం ప్రాణం పోసుకుంటుంది. అలాగే కొబ్బరి కాయ కూడా ఫలము. అది కూడా  ఒక జీవుడి తో, ఒక  ప్రాణముతో సమానము కాబట్టి కొబ్బరికాయ పగల కొట్టకూడదు.

3. భగవంతునికి ప్రదక్షణలు ఎలా చేయాలి?
 తొమ్మిది నెలల నిండు గర్భిణీ నిండు నీళ్ళ బిందె భుజం  మీద పెట్టుకొని ఎంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తుందో ఆ విధంగా భగవంతునికి  ప్రదక్షిణలు చేయాలి.

4. ఎన్ని యజ్ఞాలు చేసినా పోని పాపాలు ఏవి?
 పరుల ధనాన్ని  చేజిక్కించుకున్న వారికి, పరాయి భార్యని ఆశించి పొందినవానికి, ఇంటి  యజమాని లేనప్పుడు పిల్లలకు చెందాల్సిన ఆస్తిని కాజె చేసిన వారికి, శ్రద్ధ దులు  పెట్టినా, ఎన్ని  దానాలు ఇచ్చినా  వారి పాపాలు నశించి. ఆ పాపాలకు శిక్ష పైలోకాల్లోనూ, ఇక్కడ అనుభవించాల్సిందే.

5. సూర్యనమస్కారాలు ఎప్పుడు చేయాలి?
 సూర్యుడు ఉదయించే సమయంలోనూ, మరియు అస్తమించే సమయంలోనూ చేయడం మంచిది.

6. దేవాలయపు వెనుక భాగాన్ని ఎందుకు తాకరాదు?
 చాలామంది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆలయం వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు. అలా చేయరాదు. ఎందుకంటే ఆ భాగంలో  రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి.

7. అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదా?
 అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదు ఎందుకంటే అదీ దరిద్రానికి సూచిక. అలాగే కంచం ఒడిలో పెట్టుకొని అన్నం  తినకూడదు. ఎప్పుడు తిన్నా కొంచెం అప్పుడే కడగాలి. ఇలా చేస్తే దరిద్రం మన దరిచేరదు

మరింత సమాచారం తెలుసుకోండి: