మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. హిందువులు దేవుళ్లపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. పూజలు పునస్కారాలు అంటూ గుళ్ళూ గోపురాలు చుట్టూ తిరుగుతుంటారు. దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా చాలా మంది కొబ్బరి కాయ కొడుతుంటారు. ఇక ఇంట్లో  దేవుడికి పూజ చేసేవారు, తమ ఇష్ట దైవాలకు ప్రీతి కరమైన రోజున నైవేద్యం పలహారాలు పెట్టి, కొబ్బరి కాయ కొడుతుంటారు. అంతేకాదు హిందువులు ఏ పూజలు చేయాలన్నా శుభకార్యాలు మొదలుపెట్టాలన్నా ముందుగా కొబ్బరి కాయ కొట్టి ఆ తర్వాతనే పనిని ఆరంభిస్తారు.

సినిమాలు ప్రారంభం అయినా, భూమి పూజ అయినా ఇలా ప్రతి శుభ కార్యానికి ముందుగా కొబ్బరి కాయ కొట్టి వేడుకుంటారు. ఇలా హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. కొబ్బరి కాయను మానవుని యొక్క శిరస్సుతో పోలుస్తారు. ఎలా అయితే కొబ్బరి కాయ కొట్టినప్పుడు  భాగాలుగా విడి పోతుందో అదే విధంగా.. మనసులోని గర్వం, అసహనం మరియు ద్వేషం లాంటివి కొబ్బరి కాయ లాగా ముక్కలుగా అయిపోవాలని సింబాలిక్ గా అర్థం. ఇలా ప్రతి శుభ కార్యానికి కొబ్బరి కాయతో ప్రారంభించి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఇలా కొబ్బరి కాయ కొట్టినప్పుడు అది కుళ్ళి పోయి ఉంటుంది.

దీనిని అశుభం అపచారం అని ఆందోళన చెందుతుంటారు. కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కుళ్ళిన కొబ్బరి కాయ వస్తే మన జీవితంపై ఉన్న దిష్టి అంతా కూడా తొలగి పోయినట్లే అని అని అర్థం. కాబట్టి కొబ్బరి కాయ కొట్టినప్పుడు ఒక వేళ అది కనుక కుళ్లిపోయి ఉంటే... కంగారు పడకుండా ముందుగా ఆ స్థలాన్ని శుభ్రపరిచి, తిరిగి కొనసాగిస్తే సరిపోతుంది. అంతే తప్ప అదేదో పెద్ద అపచారం అన్నట్లు బాధపడుతూ కూర్చో రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: