నేడు ముస్లిం సోదరులకు మరియు సోదరీమణులకు ఎంతో పవిత్రమైన  రోజు. నేడు ముస్లిం లు రంజాన్ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. రంజాన్ పర్వదినం ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.  ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెలను రంజాన్ మాసంగా పిలుస్తారు. దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే ఆవిష్కరించబడింది అని  ముస్లింలు విశ్వసిస్తారు . పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించిన నెలగా ఈ మా మాసమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఎంతో పవిత్రంగా గడుపుతారు.

మహ్మద్‌ ప్రవక్త హజరత్‌ రసూల్‌ ఇల్లల్లాహి మానవులను కష్టాల నుండి రక్షించేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసమంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస (రోజా) దీక్షలు చేస్తూ , దానధర్మాలు చేస్తూ ముస్లిములు తమ భక్తిని వెల్లడిస్తారు. ముస్లింలు రంజాన్ మాసంలో చివరి పది రోజులు ఇళ్లను వదిలి మసీదులోనే ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ ప్రార్థనలో మహాప్రవక్త అల్లాహ్ గురించి బోధిస్తారు.  ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఆహారం తీసుకుని ఇక అప్పటి నుండి సూర్యాస్తమయం వరకు కనీసం లాలాజలం కూడా మింగకుండా కఠిన ఉపవాస దీక్షను చేస్తారు వీరు.

8 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్క ముస్లిం రోజుకు 5 సార్లు నమాజ్ చేయాల్సి ఉంటుంది. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఈ నెలలో నరక ద్వారాలు మూసి ఉంటాయని, కాబట్టి ఈ మాసంలో చనిపోయిన వారు  నేరుగా స్వర్గానికి చేరుతారని ముస్లింల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రంజాన్ మాసంలో  మరణించిన వారు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారని భావిస్తారు. వీరికి ఈ రోజు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముస్లింలు అందరికీ హ్యాపీ రంజాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: