నేడు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ రోజు సోదరీమణులు తమ సోదరుడి చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. "రక్షాబంధన్" పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై తిలకం దిద్ది స్వీట్లు తినిపిస్తారు. పురాణాల ప్రకారం లక్ష్మి దేవి మొదట బలి రాజుకు శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టింది. ఈ కారణంగానే రాఖీ పండుగను వేలాది సంవత్సరాలుగా జరుపుకుంటారు. రక్షాబంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు, భద్ర కాలం, రాహుకాలం, గ్రహణ కాలం, శుభ ముహూర్తాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరి ఈరోజు ఏ సమయంలో రాఖీ కట్టాలి ? ఏ సమయంలో రాఖి కడితే మంచిది కాదో తెలుసుకుందాం.

రక్షా బంధన్ శుభ ముహూర్తము 2021:
ముహూర్త శాస్త్రంలో భద్ర, రాహుకాలం చాలా అశుభ సమయాలుగా పరిగణించబడతాయి. ఈ సమయంలో చేసిన ఏ పని విజయవంతం కాదు. అందుకే భద్ర, రాహుకాల సమయంలో ఏ శుభ కార్యం చేయరాదని నమ్ముతారు. భద్రాలో శివుడు తాండవ నృత్యం చేస్తాడు. ఈ కారణంగా భద్రలో శుభ కార్యాలు జరగవు.

ఆగష్టు 22, భద్ర కాలం, రాహుకాల
రక్షా బంధన్‌లో అశుభం అని చెప్పబడే భద్ర రోజంతా ఉండదు. రక్షాబంధన్ పండుగను రాహు కాలం ప్రారంభానికి ముందు సాయంత్రం 04:30 గంటలకు జరుపుకుంటారు. దీనిలో మధ్యాహ్నం 12 గంటల ముహూర్తం 01 గంటల వరకు ఉత్తమంగా ఉంటుంది.

కట్టడానికి రాఖీ శుభ సమయం:
ఉదయం 06 గంటలు 15 నిముషాలు
ఉత్తమ శుభ సమయం: మధ్యాహ్నం 12 గంటల నుండి 01 గంటల వరకు
 రాహుకాల సమయాలు: సాయంత్రం 05:12 నుండి 06:49 వరకు (రాహుకాల సమయంలో రాఖీ కట్టడం అశుభం)

మరింత సమాచారం తెలుసుకోండి: