చాలా మంది భక్తులు మనశ్శాంతి కోసం లేదా కోరికలను నెరవేర్చుకోవడానికి కోసం దేవతలను దర్శించుకుంటూ వుంటారు. ఇలాంటి వారు చాలా మంది గుడికి వెళుతూ తమ మనసులో ఉన్న మాటను భగవంతుడితో చెబుతూ ఉంటారు.. ఇకపోతే ఆ గుళ్లో కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తాయట. సాధారణంగా కోతులు, కుక్కలు ,పాములు అనుకోకుండా గుడి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ భక్తుల పెట్టే ప్రసాదం తిని ఎవరికి ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోయినా సందర్భాలను మనం ఎన్నో చూసే ఉంటాం.
ఇకపోతే అక్కడ ఉన్న దేవాలయంలో పూజారి శంఖం పూరించిన వెంటనే అడవిలో ఉన్న క్రూర మృగాలు, జంతువులు అన్ని అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అక్కడున్న భక్తులకు ఎటువంటి హాని కలిగించకుండా వెళ్ళిపోతాయట. వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా, చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మాత్రం ఇది జరుగుతోంది. సాధారణంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చూడడానికి ఎన్నో వింతలు, అద్భుతాలతో పాటు అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
చత్తీస్ ఘడ్  రాష్ట్రంలో మహాసముందు అనే జిల్లాలో బాగాబాహార అనే  గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక గుట్టపైన చండీదేవి ఆలయం ఒకటి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు.. ఇక ఈ గుడి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటం కారణంగా మృగాలతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారిని గత 20 సంవత్సరాల నుండి దర్శించుకుంటున్నాయట.
వాటికి ఎవరో చెప్పిన విధంగా ప్రతిరోజూ పూజారి శంఖం పూరించిన వెంటనే , అక్కడికి చేరుకొని పూజారి , భక్తుల పెట్టిన అన్న ప్రసాదాలను స్వీకరించి, అమ్మవారిని దర్శించుకుని అక్కడినుంచి వెళ్లిపోతాయట. ఇక ఈ క్రూర మృగాలు ప్రజలకు అలాగే భక్తులకు ఎలాంటి హాని చేయకుండా వెళ్లడానికి కారణం అమ్మవారి ఆశీర్వాదం అలాగే మహిమ అని చెబుతూ ఉంటారు అక్కడికి వచ్చిన భక్తులు.. అంతే కాదు ఇక్కడ చండీదేవి అమ్మవారిని ఎంతో పవిత్రంగా పూజించడం వల్ల వారి నష్టాలను ,కష్టాలను అమ్మవారు తీరుస్తుంది అని వారి నమ్మకం.


మరింత సమాచారం తెలుసుకోండి: