ఇంట్లో పూజ అనేది ఎవరు చేయాలి..? అనే విషయానికి వస్తే , కచ్చితంగా స్త్రీలు మాత్రమే చేయాలి అని చెబుతూ ఉంటారు చాలా మంది.. కానీ స్త్రీలు పూజ చేయకూడదట..? మరి ఇంట్లో పూజ ఎవరు చేయాలి..? ఇంట్లో ఎవరు పూజ చేస్తే ఆ ఫలితం కుటుంబానికి చెందుతుంది..? అనే కొన్ని ఆసక్తికర విషయాలను పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..



నిజానికి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం అనుసరించినట్లయితే ఇంట్లో పూజ ప్రతిరోజు భర్త లేదా ఆ ఇంటికి పెద్ద  మాత్రమే ప్రతిరోజు దేవుడు ముందు దీపం పెట్టి పూజ చేసి..ఇంట్లో  ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించమని ఆ దేవుడిని వేడుకోవాలట. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం , ఆడవారు దేవుడి గదిలో పూజ చేయకూడదట.. ఒకవేళ  ఆమె భర్తకు సమయం లేని యేడల అప్పుడు ఇంట్లో ఆడవారు దీపారాధన చేయవచ్చు.. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంట్లో దేవుడి ముందు స్త్రీలు పూజ చేసినట్లయితే ఆ పూజాఫలం కేవలం వారికి మాత్రమే సొంతం అవుతుందట.. ముఖ్యంగా ఆడవారు చేసుకునేవి  వ్రతాలు , నోములు మాత్రమే..

ఆడవారు  పెళ్లికాకముందు మంచి భర్త రావాలని,  పెళ్లి అయిన తర్వాత సౌభాగ్యవతి గా ఉండాలని మాత్రమే వ్రతాలు, నోములు చేసుకోవాలట.. భర్త ఆరోగ్య క్షేమం పొందాలి అంటే ఆడవారు వ్రతాలు చేసుకుని సాధించవచ్చు అని పండితులు, పురోహితులు చెబుతున్నారు.. ఒక కుటుంబం మొత్తం క్షేమంగా,  అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే కచ్చితంగా ఇంట్లో దేవుడి ముందర మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి..


మనం ఎక్కడైనా దేవాలయాల్లో అర్చన చేసేటప్పుడు మొదటగా భర్త పేరు లేదా ఆ ఇంటి పెద్ద పేరు మాత్రమే చెప్పడం ఆనవాయితీ.. అంతేకాదు ఎవరైనా మీరు ఎవరు అని అడిగినప్పుడు.. తప్పకుండా భర్త పేరు లేదా తండ్రి పేరు లేదా ఇంటి పెద్ద పేరు చెబుతాము..కాబట్టి కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం ఎక్కువగా శ్రమించేది ఇంటి పెద్ద లేదా తండ్రి లేదా భర్త మాత్రమే కాబట్టి.. తప్పకుండా వీరే దేవుడు ముందు దీపారాధన చేయాలి అని పండితులు చెబుతున్నారు.. పూజా సామాగ్రి మాత్రమే ఆడవారు సమకూర్చాలి. ఇక మగవారు పూజ చేసిన తర్వాత.. ఆడవారు కేవలం హారతి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: