శార్దియ నవరాత్రి అశ్విన్ నెల ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతుంది. అంటే అక్టోబర్ 7 నుండి ప్రారంభమై గురువారం 14 అక్టోబర్ వరకు ఉంటుంది. నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గా మాత వివిధ రూపాలను పూజిస్తారన్న విషయం తెలిసిందే. నవరాత్రి సమయంలో చాలా మంది అమ్మవారి భక్తులు ఉపవాసం ఉండడమే కాకుండా తన కోరికలు నెరవేర్చమని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎవరైతే పూర్ణ హృదయంతో దుర్గాదేవిని పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.

నవరాత్రి మొదటి రోజున కలశ స్థాపన జరుగుతుంది. ఆరోజు దుర్గామాతను పూజిస్తారు. నవరాత్రికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. అయితే ఈసారి నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే ప్రత్యేక యోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నారు.

నవరాత్రి నాడు ప్రత్యేక యోగా
ఈసారి నవరాత్రి గురువారం నుండి ప్రారంభమవుతుంది. ఆరాధన మొదటి రోజున అనేక శుభకరమైన యాదృచ్చికాలు జరుగుతున్నాయి. నవరాత్రులలో ఐదు రవి యోగాలతో శుభకరమైన ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. సంతోషం, అదృష్టానికి చిహ్నమైన చిత్ర నక్షత్రంలో నవరాత్రి ప్రారంభమవుతుంది. జ్యోతిష్యుల ప్రకారం ఒక వ్యక్తి నవరాత్రి శుభ సమయంలో ఏదైనా పనిని ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం పొందుతాడు. అంతే కాకుండా ఈ కాలంలో సమయంలో ఇల్లు, ఆస్తి, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు

హిందూ క్యాలెండర్ ప్రకారం అభిజిత్ ముహూర్తాన్ని కలశాన్ని ఏర్పాటు చేయడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ముహూర్తంలో ఇంట్లో ఉన్న అనేక లోపాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయని నమ్ముతారు. అక్టోబర్ 7 న అభిజిత్ ముహూర్తం ఉదయం 11.37 నుండి 12.23 వరకు ఉంటుంది. ఎవరైనా ఉదయం సమయంలో కలశాన్ని స్థాపించాలనుకుంటే ఉదయం 06:54 నుండి 9.14 గంటల మధ్య చేయవచ్చు. ఈసారి నవరాత్రికి 8 రోజుల నవరాత్రి ఉంటుంది. రెండు తేదీలు ఒకే రోజున వస్తాయి.

కన్యా పూజకు ప్రత్యేక ప్రాధాన్యత
నవరాత్రిలో అమ్మాయిని పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది రోజులు ఉపవాసం పాటించేవారు లేదా దుర్గాష్టమి రోజు ఉపవాసం పాటించే వారు కన్యా పూజ చేస్తారు. కొంతమంది నవమి రోజున కన్యను ఆరాధిస్తారు. కన్యా పూజ రోజున ప్రజలు తొమ్మిది మంది అమ్మాయిలను తొమ్మిది రూపాల దుర్గామాతగా ఆరాధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: