బ్రతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ప్రచారంలో ఉన్నా యి అందులో ముఖ్యంగా తెలంగాణ చరిత్రపరంగా ప్రాచుర్యం లో ఉన్న కథ


IHG

చాళుక్యులు రాష్ట్రకూటులు దగ్గర సామంతులుగా ఉన్న రోజుల్లోరాష్ట్ర కూటులకు, చాళుక్యు లకు మధ్య జరిగిన యుద్ధం లో చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. అయితే కొంత కాలానికి రాష్ట్ర కూటుల చివరి రాజైన కార్కు డిని చాళుక్య రాజైన తైలపాడు చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పా టు చేశాడు. ఈ కల్యాణ చాణుక్య రాజ్యమే నేటి తెలంగాణ ప్రాంతం.తైలపాడు మరణాంతరం అతని కుమారుడు సత్యప్రాయుడు అప్ప టి వేములవాడ ( కరీంనగర్ జిల్లాలో) ప్రఖ్యాతి గాం చిన రాజరాజేశ్వర ఆలయం నిర్మిం చాడు. ఈ ఆలయ ప్రత్యే కత ఏమిటంటే ఆపదలో ఉన్న వారిని రక్షిస్తుం దని అప్ప టి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే రాష్ట్రకూటుల నుండి ఆపద పొం చి ఉండడంతో చోళరాజు పరాంతక సుందర చోళుడు ఈ ఆలయంలో దాక్కు న్నా డు. అమ్మ వారే తనని కాపాడిందని నమ్మా డు. అందుకు గుర్తుగా తన కుమారుడికి రాజరాజ అని పేరు పెట్టాడు. తదనంతరం రాజ రాజ చోళుడు క్రీస్తుశకం 985 నుండి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలంలోనే రాజ రాజ చోళుని కుమారుడు రాజేంద్రచోళుడు సత్యప్రాయుడు ని ఓడించి రాజరాజేశ్వ ర ఆలయాన్ని కూల్చి వేసి అందులోని శివలింగాన్ని తన తండ్రిరాజరాజచోళుని కి బహుమతి ఇచ్చా డు తర్వాత రాజరాజచోళుడు ఓ పెద్ద గుడిని నిర్మిం చి ఆ గుడిలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠిం చాడు. ఇప్పు డు ఆ శివలింగం బృ హదీశ్వ రాలయం లో కనిపిస్తుంది. దీనికి నిదర్శ నం భీమేశ్వరాలయం శివలింగానికి , బృ హదీశ్వ ర ఆలయం లోని శివలింగానికి దగ్గర పోలికలు ఉంటాయి. రాజరాజేశ్వ రి ఆలయం లోని గౌరీ సమేత శివుని విగ్రహం లోని శివుని లింగాన్నిమాత్రమే అపహరించి బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్టిం చారు . ఆవేదన చెందిన తెలంగాణ ప్రజలు గౌరీదేవిని ఒంటరిగా వదిలిపెట్టి శివలింగాన్ని మాత్రమే తీసుకెళ్లినందుకు ప్రతీకగా గౌరీదేవిని పూలతో త్రికోణాకారంలో మేరుపర్వతంలా పూలను అమర్చి బ్రతుకమ్మ ను నిర్వహిం చడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. బృహదమ్మ ( పార్వత) నుండి శివుని వేరు చేసినందుకు గాను బతుకమ్మ ను అమర్చి చోళులకు వారి తప్పుని తెలియజేయడం మొదలు పెట్టారు తెలంగాణ ప్రజలు . బృ హదమ్మ నుండి వచ్చిం దే బ్రతుకమ్మ అని నమ్ముతారు తెలంగాణ ప్రజలు. బ్రతుకమ్మ పండుగను దాదాపుగా క్రి. శ. 1000 సంవత్సరంనుండి నుండి తెలంగాణలో జరుపుకోవడం జరుగుతుంది .


IHG

 

అదేవిధంగా ప్రాచుర్యం లో ఉన్న వేరొక కథ ఏమిటంటే పూర్వం లో కాపు దంపతులకు ఆరుగురు సంతానం పుట్టి చనిపోతుంటే ఏడవ సంతానం గా కుమార్తె పుట్టడంతో ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఒక కుమారుడిని కన్న తర్వాత బతుకమ్మ కు పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం జరిగింది. అత్తవారింట్లోఒకరోజు బతుకమ్మ , ఆమె మరదలు కలసి స్నా నం చేయడానికి ప్రక్కనే ఉన్న కొలను కి వెళ్తారు. స్నానం చేసిన తర్వాత ఈ ఇద్దరూ తమ తమ చీరలు మార్చి కట్టుకుంటారు బతుకమ్మ మ మరదలు తన చీరను కట్టుకున్న కారణంగా బతుకమ్మ ను గొం తు నులిమి చంపి కొలను ప్రక్కన పాతి పెడుతుంది .ఒకరోజు బతుకమ్మ తన భర్త నిద్రిస్తుం డగా కలలోకి వచ్చి తనను తీసుకెళ్లమని ప్రాధేయ పడుతుంది. ఆ మరుసటి రోజే బతుకమ్మ భర్త కొలను కు వెళ్లి అంతా పరీక్షించి చూడగా అక్కడ ఎప్పు డూ లేని విధంగా తంగేడు చెట్టు పూలు దర్శ నమిస్తాయి. ఆ అందమైన తంగేడు పూలను కోయటానికి చెట్టు దగ్గరికి వెళ్లగా ఆ చెట్టు జరిగిన కథను తన భర్తకు వివరిస్తుం ది . అప్ప టినుండి తంగేడు పూలను పేర్చి బతుకమ్మ ను గౌరీదేవిగా కొలవడం ఆనవాయితీగా వచ్చింది,


IHG

 

అదేవిధంగా ప్రాచుర్యం లో ఉన్న మరొక కథ ఏమిటంటే దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ రాజు ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు పునస్కా రాలు చేయగా అయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కంటుంది. ఆమెకు బాల లక్ష్మి అని పేరు పెడతారు. కాలక్రమేనా ఆమె అనేక గండాలు తప్పిం చుకుంటూ ఉన్న ది కావున ఆమెకు ఆమె తల్లిదండ్రులు బ్రతుకమ్మా అని పేరు పెట్టారు అప్ప టినుంచి యవ్వ న యువతులు తమకు మంచి భర్త రావాలని కోరుతూ బతుకమ్మ ను కొలవడము ఆనవాయితీగా వచ్చిం ది అని ఈ కథ చెబుతుంది

అదేవిధంగా బ్రతుకమ్మ పండుగ వెనుకున్న ప్రాచుర్యం పొందిన కథల్లో మరొక కథ భూస్వాముల అఘాయిత్యాలకు ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంటుంది . ఆమె మరణాంతరం ఊరి ప్రజలు ఆమెను బ్రతుకమ్మా అని దీవించారంటా అందుకనే ఈ పండుగకు బ్రతుకమ్మ అని పేరు వచ్చింది అని అంటారు. అందుకనే ఈ పండుగ స్త్రీ లకు సంబందించిన , బ్రతుకమ్మను పూజించే పండుగగా ఈ పండుగ ప్రాచుర్యం పొందింది . స్త్రీ లు అందరు తమకు ఎటువంటి ఆపదలు రాకుండా తమ భర్తలు మరియు కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకొనే వాళ్ళు .  

మరింత సమాచారం తెలుసుకోండి: