మనము నివసిస్తున్న ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినది. ఇక్కడ వివిధ రకాల మతాలు, భాషలు, జాతులు, కులాలు వారు అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పండుగలను జరుపుకుంటూ ఉంటారు. జాతీయ పండుగలు తప్పించి మిగిలిన చాలా పండుగలు ఆయా రాష్ట్రాల ఆచార వ్యవవహారాలను బట్టి జరుపుకుంటూ ఉంటారు. అదే విధంగా మన తెలుగు రాష్ట్రము అయిన తెలంగాణాలో కూడా అన్ని పండుగలతో పాటుగా ఒక ప్రత్యేకమైన పండుగనాడు ఎప్పటి నుండో జరుపుకుంటూ వస్తున్నారు. అదే బతుకమ్మ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే ముందు 15 రోజులు తర్వాత 15 రోజులు ప్రతి ఒక్క కుటుంబం కలిసి మెలిసి ఆనందంగా జరుపుకుంటారు.

ఈ సారి కూడా అదే విధంగా బతుకమ్మ పండుగను ఈ రోజు అనగా 6 అక్టోబర్ నుండి 14 అక్టోబర్ వరకు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా ఆచార పద్దతులతో జరుపుతారు. అయితే చాలా మందికి కూడా బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది. మనము ఎందుకు ఈ పండుగను జరుపుకుంటున్నాము అన్న పలు విషయాలు తెలియకపోవచ్చు. అయితే అసలు బతుకమ్మ పండుగ వెనుకున్న కథేమిటో ఒకసారి చూద్దాం.

పూర్వం నవాబులు మరియు భూస్వాములు తెలంగాణ ప్రాంతాలను పరిపాలిస్తూ ఉండేవారు. వీరు తమకన్నా తక్కువ కులాల వారిని ఎంత హీనంగా చూసేవారు అంటే కుక్కల కన్నా చాలా ఘోరంగా చూసేవారు. తమకు ఆడు వచ్చిన వారిని వదిలి పెట్టేవారు కాదు. ఇక ఆడవారి మీద వారి పెత్తనాలకు అడ్డు అదుపు లేకుండేది. అయితే అప్పట్లోనే కొంతమంది తిరుగుబాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇలా వీరి అన్యాయాలకు మరియు అకృత్యాలకు తాళలేక ఎందరో అబలలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు లెక్కలేదు. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారిని గుర్తు చేసుకుని మిగిలిన మహిళలు కుమిలి కుమిలి ఏడ్చేవారు. అంతే కాకుండా వారి చావుకు గుర్తుగా రకరకాల పూలను గుండ్రంగా పోసి "బతుకు అమ్మా" అని పాటలు పాడేవారట. ఇదే ఆ బతుకమ్మ పండుగ వెనుకున్న కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: