IHG


తెలంగాణ లో బ్రతుకమ్మను తొమ్మిది రోజులు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులో ఒక్కో రోజు ఒక్కో విధంగా పండుగను ఆచరిస్తారు ..మొదటి రోజు ఎంగిలి పూల బ్రతుకమ్మ గా మొదలై సద్దుల బ్రతుకమ్మగా పండుగ ముగిస్తారు. ఈ తొమ్మిది రోజులు బ్రతుకమ్మను రకరకాల పూలతో అమ్మవారిని ఓ మేరు పర్వతం లా అలంకరించి పెళ్లి కావలసిన యువతులు , స్త్రీలు బ్రతుకమ్మ చుట్టూ చేరి వృత్తాకారం లో తిరుగుతూ చప్పట్లు తడుతూ పాటలు పాడుతారు...ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో విధంగా బ్రతుకమ్మను తయారు చేస్తారు. బ్రతుకమ్మతో పాటు బొడ్డెమ్మను కూడా ఆ పూజలో చేర్చి పూజిస్తారు


IHG

ఈ బ్రతుకమ్మ పండుగకు చాల కథలు అందుబాటులో ఉన్నా బ్రతుకమ్మ ను గౌరీ దేవి ప్రతి రూపంగా చేసి పూజ చేస్తారు. బ్రతుకమ్మ ను పూజించే తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బ్రతుకమ్మ ను తొమ్మిరోజులు మాత్రమే ఎందుకు పూజిస్తారనే విషయం చాలా మందికి తెలియదు. పురాణాలలో చూసుకుంటే దానవుడైన రంభుడు కుమారుని కొరకు పర్వత శిఖరం పై కూర్చుని అగ్ని దేవుడికి తపస్సు చేస్తాడు. రంభుడి తమ్ముడు కరంభుడు తపస్సు చేస్తూ ముసలి చేత చనిపోతాడు .అదిచూసి రంభుడు తన తమ్ముడు
   చనిపోవడంతో తాను కూడా చనిపోవడానికి  సిద్దమై తన తలను అగ్నికి ఆహుతిగా చేసి వధించుకోబోతాడు కరుణించిన అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ముల్లోకాలను జయించే కుమారుడు కావాలని కోరుకుంటాడు. అగ్నిదేవుడు తధాస్తు చెప్పి వెళ్ళిపోతాడు.

IHG


 రంభుడు మార్గం మధ్యలో ఓ మహిషం ( గేదె ) ను చూసి  రమిస్తాడు అప్పుడు పుట్టినవాడే మహిశాసురుడు. మహిసారుడు పుట్టినతరువాత రంభుడు మరణిస్తాడు. మహిశాసురుడు ని శుక్రాచార్యుడు పెంచుతాడు. మహిశాసురుడు యుక్త వయసు వచ్చిన తరువాత మహిశాసురుడు బ్రహ్మ కోసం తపస్సుచేస్తాడు. బ్రహ్మ ప్రత్యేక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు మహిశాసురుడు నాకు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ ఒప్పుకోక పోగా మహిశాసురుడు మగవారి వల్ల కాకుండా స్త్రీ వల్లే మరణం పొందే వరం కావాలని కోరుకుంటాడు. అప్పుడు భ్రమ్మ తధాస్తు చెప్పి వెళ్ళిపోతాడు. తండ్రి పొందిన తపస్సు ప్రభావం , మహిశాసురుడు పొందిన వరాల  ప్రభావంతో మహిశాసురుడు ముల్లోకాలను జయించాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు , ఇంద్ర లోక దేవతలు కూడా యుద్ధంలో ఓడిపోతారు. ఈ క్రమంలో దేవతలు అమరావతిని విడిచి పారిపోతారు. ఈ క్రమంలో దేవతలందరు కలసి తమశక్తులన్నింటిని కలిపి ఓ బృహత్ స్త్రీ రూపాన్ని తయారుచేస్తారు. ఈ క్రమంలో ఉద్బవించిన స్త్రీ రూపమే శక్తి .


IHG

 ఈ క్రమంలో దేవతలందరినీ చూసి శక్తి నవ్వుతుంది. ఆ నవ్వు విన్న మహిషుడు ఆ నవ్వు నవ్విన స్తీ ఎవరు అని అడిగి తెలుసుకుంటాడు. ఆ స్త్రీ ని మహిశాసురుడు పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ స్త్రీ శక్తి నవ్వి నన్ను యుద్ధంలో ఓడించి నన్ను పెళ్ళాడమని చెబుతుండటా . మహిషాసురుడిసైన్యాన్ని వధించడానికి ఎనిమిది రోజులు కష్టపడుతుంది శక్తి. ఆ తరువాత తొమ్మిదో రోజు మహిషాసురుడిని చంపి శక్తి మామూలు రూపానికి వస్తుందట.శరదృతువు లో తొమ్మిది రోజులు ఈ రాక్షసుల వధ జరిగింది కావున దేవి నవరాత్రులు జరుపుకుంటారు ఈ ఉత్సవాల్లో గౌరీ దేవిని బ్రతుకమ్మగా మలచి పూజిస్తారు. పడవరోజున మహిశాసురుడు పై విజయం సాధించినందుకు విజయ దశమిగా (దసరా ) పండుగ జరుపుకుంటారు.


IHG












మరింత సమాచారం తెలుసుకోండి: