దేవీ నవరాత్రులు దసరా సందర్భంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఈరోజు దసరా నవరాత్రులలో రెండవ రోజు కాబట్టి అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక అమ్మవారికి మనమిచ్చే నైవేద్యాల వల్ల అమ్మ వారి మెప్పు పొంది మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వస్తాయి అని పెద్దల నమ్మకం. అయితే అమ్మవారు మెచ్చే నైవేద్యాలను ఎలా తయారు చేయాలి ..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


చిట్టి గారెలు: వీటిని మాష చక్రములు అని కూడా అంటారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మినుములతో తయారుచేసే ఈ చిట్టి గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పంచుకుంటే అమ్మవారు ఇష్టంగా స్వీకరిస్తారట.

కట్టె పొంగలి : బియ్యం, పెసరపప్పు ,జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఉపయోగించి చేసే కట్టె పొంగలి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. ముఖ్యంగా భవానీదేవి కి కట్టె పొంగలినీ నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు అని పెద్దలు చెబుతున్నారు.

దద్దోజనం: పెరుగు అంత చల్లగా అమ్మవారు ఆశీస్సులు  భక్తులపై ఉంచాలని ప్రతీకగా అమ్మవారికి దద్దోజనం ప్రసాదిస్తూ ఉంటారు. పెరుగు అన్నం తో చేసే ఈ దద్దోజనం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట.

నువ్వులన్నం: నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ నువ్వుల అన్నాన్ని వండుతారు. అసురులతో పోరాడే కాళికాదేవికి నువ్వులలో ఉండే విష్ణు శక్తి తోడవ్వాలని ఇలా చేస్తారు.

చిత్రాన్నం /పులిహోర/హరిద్రాన్నం:
పోపు గింజలు, నిమ్మకాయ కలిపి చేసే ఈ చిత్రాన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాల్లో మనం వెళ్ళిన ప్రతిసారి చిత్రాన్నం  లేదా పులిహోరను ప్రసాదంగా భక్తులకు పంచుతూ ఉంటారు పూజారులు.

గుడాన్నం : పెసరపప్పు, బియ్యం  ఉడకబెట్టి అందులో  బెల్లం, నెయ్యి, సుగంధ ద్రవ్యాల పొడి, ఎండు ఫలాలను వేసి ఈ గుడాన్నం  తయారు చేస్తారు.

శాకాన్నం:
తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధద్రవ్యాల పొడులు వేసి అమ్మవారికి అన్నం వండి నైవేద్యం గా సమర్పిస్తారు.


ఈ నవరాత్రులు అమ్మవారికి ఇలా ప్రసాదాలు చేసి సమర్పించడంవల్ల అమ్మవారు ప్రసన్నం చెంది మనకు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను సిద్దిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: