శరద్ పూర్ణిమతో వర్షాకాలం ముగుస్తుంది. ఈ పండుగను పంట పండుగగా భావిస్తారు. ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో అశ్విని నెల పౌర్ణమి తేదీన వస్తుంది. ఈసారి 19 అక్టోబర్ 2021 మంగళవారం వచ్చింది. శరద్ పూర్ణిమను కుమార పూర్ణిమ, కోజగిరి పూర్ణిమ, నవన పూర్ణిమ, కౌముది పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున రాధా కృష్ణ, శివ పార్వతి, లక్ష్మీ నారాయణ వంటి జంట దైవాలను పూజిస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవి భూమి పైకి దిగి వచ్చి, ఆమె దివ్య కృపను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.

శరద్ పూర్ణిమ 2021 : పూర్ణిమ తిథి అక్టోబర్ 19 రోజు రాత్రి 07:03 నుంచి ప్రారంభమై 20 అక్టోబర్  08 : 26 సమయంలో ముగుస్తుంది. సంవత్సరంలోని అన్ని పౌర్ణమిలలో ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి. శ్రీకృష్ణుడు పదహారు కళలతో జన్మించాడు. అలాగే శరద్ పూర్ణిమ నాడు చంద్రుడు మొత్తం పదహారు కళలతో ఉద్భవించాడని, చంద్రుని కిరణాలు మనిషి ఆత్మ, శరీరానికి శక్తితో బాగు చేస్తాయని నమ్ముతారు. చంద్రుని కిరణాలు అమృతాన్ని పంపుతాయట. అందుకే రాత్రంతా వెన్నెలలో అన్నంతో చేసిన పాయసం పెట్టి, ఉదయం ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడని, దాని కిరణాలు మంచివని జ్యోతిష్యశాస్త్ర విశ్వాసం.

గుజరాత్‌లో దీనిని శరద్ పూనమ్ అని పిలుస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుడు దైవిక ప్రేమ నృత్యం చేశాడని నమ్ముతారు. శరద్ పూర్ణిమ ప్రాముఖ్యత బ్రహ్మ పురాణం, స్కంద పురాణం, లింగ పురాణం మొదలైన వాటిలో చెప్పబడింది. భక్తులు త్వరగా నిద్రలేచి, స్నానం చేసి, ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసి అలంకరిస్తారు. విగ్రహాలను ఎక్కువగా తెల్లని దుస్తులతో అలంకరిస్తారు. ఉపవాసం ఉంటారు. లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. భక్తులు శరద్ పూర్ణిమ కథను, సత్యనారాయణ కథను పఠిస్తారు. తెల్లని పువ్వులు, తులసి ఆకులు, అరటి, ఇతర పండ్లు, ఖీర్ అందిస్తారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, పొడి పండ్లతో చేసిన చరణామృతం ప్రసాదంలో ఒక భాగం.


మరింత సమాచారం తెలుసుకోండి: