శనివారం రోజున వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కి ఎక్కువ పూజలు అందుతాయి. ఎందుకంటే శనివారం రోజున దేవతలకు బాగా ఇష్టమైన రోజు ఆరోజు. అందుచేతనే భక్తులు కూడా వీరికి విశేషమైన పూజలు అందిస్తారు. అయితే ఆ రోజు దీపారాధన ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.


అయితే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు వెండి దీపాలలొ, మట్టి దీపాలలో దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి ఇవన్నీ సరైన పద్ధతులు కావు. కేవలం పిండి తో చేసినటువంటి దీపారాధన వల్లే ఎక్కువగా కార్యక్రమాలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు. శనివారం రోజున పొద్దున్నే లేవగానే స్నానం చేసి, మన పూజగదిని నీటితో శుభ్రం చేసి, మన ఇష్ట దేవుని పూజించాలట.

ముఖ్యంగా వెంకన్న స్వామి కి తులసి మాల అంటే ఎంతో ఇష్టం ఆ రోజున ఆ తులసిమాలలతో, తులసి ఆకులతో అభిషేకం చేసినట్లయితే.. వెంకన్న స్వామి మనల్ని ప్రసన్నలు చేస్తారు. శనివారం రోజున పూజ చేయాలనుకునేవారు బియ్యప్పిండిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాటితో చేసిన దీపారాధన ల తో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యక్రమాలని నెరవేరుతాయి. మనకి ఈ ఉంది డబ్బు సమస్య కూడా తొలగిపోతుంది అని కొంతమంది పండితులు తెలియజేశారు.


ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఎవరి ఇష్ట దైవ మతాన్ని వారు పాటించాలి. ఇలా 7 శనివారాలు, బియ్యపు పిండితో చేసినటువంటి దీపారాధన చేయడం వల్ల మా ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో నిండు ఉంటారట. పూజ అయిపోయిన వెంటనే ప్రసాదంగా పులిహోర, చక్కెర పొంగలి, పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించి నట్లయితే.. వారికి ఆ దేవుడు ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయట. ఇక చివరి రోజున గారెలు, చక్కెర పొంగలి వంటివి సమర్పించినట్లు అయితే.. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని కొంత మంది వేద పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: