జనవరి నుంచి డిసెంబర్ వరకు కొన్ని ప్రత్యేకమైన నెలల్లో వివాహం చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుందని సంఖ్యాశాస్త్ర పరంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కాని పెళ్లి చేసుకున్నట్లయితే అలాంటి దంపతులు ఒకరికొకరు ఆశ్చర్యకరమైనటువంటి బహుమతులు ఇచ్చుకుంటారు. కానీ జీవితం మాత్రం సాదాసీదాగా సాగిపోతోంది. అలాగే మార్చి లో గాని ఏప్రిల్ లో గాని పెళ్లి చేసుకుంటే చాలా రొమాంటిక్ గా ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. వారి యొక్క కుటుంబ సభ్యుల బాధ్యతలు కూడా బాగా మోస్తారు. భర్త భార్య తరుపు బంధువుల బాధ్యతలు స్వీకరిస్తాడు. భార్య భర్త తరుపు బంధువుల బాధ్యతలు స్వీకరిస్తుంది.

ఒకరినొకరు కలుపుకొని అన్యోన్యంగా ఉంటారు. మే లో కానీ లేదా జూన్ లో కానీ వివాహం చేసుకున్న వారు మాత్రం ఇలాంటి సప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చుకోరు. జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ బాధ్యతలను పట్టించుకోరు. జీవితం సాదాసీదాగానే నడుస్తుంది. అలాగే జూలై ఆగస్టు నెలలో పెళ్లి చేసుకున్నవారు వీరు ఎక్కువగా ప్రణాళికబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ, లైఫ్ లో ముందుకు పోతారు. వారి యొక్క పుట్టే పిల్లల లైఫ్ ను కూడా వాళ్లు ప్లాన్ చేసి ముందుకు పోతారు. అలాగే సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ వివాహం చేసుకుంటే  వీళ్ళు అంటే ఒక్కరంటే ఒక్కరికీ ప్రాణం లాగా ఉంటారు. ఎక్కువ సరదాగా షికార్లకు వెళుతూ ఉంటారు. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఈ నెలలోనే పెళ్లి చేసుకోవాలి. చివరగా నవంబర్-డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. అంటే వాళ్ళని చూసి ఇతరులు ఎవరైనా సరే వాళ్ళ లాగా మనం బతకాలి అని ఆలోచిస్తూ ఉంటారు.

 దానికి ప్రధాన కారణం వాళ్లు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. బాధ్యతలను బాగా స్వీకరిస్తారు. అన్యోన్యంగా జీవిస్తారు. కానీ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎవరైనా సరే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వివాహం చేసుకుంటే మాత్రం వారి వివాహ బంధం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. సంఖ్య శాస్త్రం పరంగా సాధ్యమైనంతవరకూ నవంబర్ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకుంటే మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తాయని తెలుస్తోంది. మే జూన్ నెలలో పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం కొంచెం సాధారణమైనటువంటి పరిస్థితిలు మాత్రమే ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వివాహం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: