అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఫాలో అయ్యే సంప్రదాయాలలో నాగుల పంచమి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. నాగుల పంచమి వచ్చింది అంటే చాలు ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా ఆధ్యాత్మిక శోభసంతరించుకుంటుంది. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఏకంగా నాగుల పంచమిని ఎంతో భక్తితో జరుపుకుంటూ ఉంటారు అని చెప్పాలి. సాధారణ రోజుల్లో అయితే ఏకంగా పాములు అంటే భయపడే జనాలు నాగుల పంచమినాడు మాత్రం ఏకంగా పుట్టలు దగ్గరకు వెళ్లి పాములకు పాలు పోయడం చేస్తూ ఉంటారు.
అయితే ఇలా నాగుల పంచమి రోజు పాములకు పాలు పోయడం అనే సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా పాలు పోయడం వెనక ఒక కారణం కూడా ఉందట. పురుగులు కీటకాల నుంచి పాములు పొలాలకు రక్షణ కల్పిస్తాయి. ఒకరకంగా రైతుకు మంచి చేస్తాయ్. అయితే ఇలాంటి పాములకు ఏదైనా అపాయం చేస్తామని భయంతో అవి మనపై.. అవి ఎక్కడ కాటేస్తాయో అని భయంతో మనం వాటిపై దాడి చేస్తాం. దీంతో మనుషుల పాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టేందుకే నాగుల పంచమి నిర్వహిస్తూ ఉంటారట. రైతులకు సహాయపడి అంతరించిపోకుండా.. పెద్దలు నాగుల పంచమి నాడు పుట్టలో పాములు పోయాలని ఆచారాన్ని తీసుకువచ్చారట. అయితే నాగుల పంచమినాడు పుట్టులో పాము పోసి నాగదేవతను పూజించడం వల్ల సర్ప దోషాలు కూడా పోతాయని కొంతమంది జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు.