మానవులకు ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకం అయినది. దీనిని పాటించి ఎందరో మహానీయులు ప్రఖ్యాతి గడించారు. అందుకు అర్జునుని ఉదంతం ఓ చక్కటి ఉదాహరణ. దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహకరించడానికి అర్జునుడు స్వర్గానికి ఆహ్వానించబడుతాడు. దేవతలకు విజయం లభించేలా చేస్తాడు. అర్జునుని పరాక్రమానికి దేవలోక సౌందర్యరాశి ఊర్వశి ముగ్ధురాలై ‘దీనురాలిని, నాకు కూడా సహాయం చేయమని అర్జునుని అర్థిస్తుంది. నీ ఆపద ఏమిటని అర్జునుడు ప్రశ్నించగా, నాకు నీవంటి పుత్రుని ప్రసాదించమని కోరుతుంది ఊర్వశి. అర్జునుడు ఆమె మాటలోని మర్మాన్ని గుర్తించి, పుత్రునికోసం నవమాసాల నిరీక్షణ ఎందుకు? ఈ రోజు నుండి నేను నీకు పుత్రుడినే అంటూ చేతులు జోడించి ఆమెకు సమస్కరిస్తాడు. పాండవ మధ్యముడైన అర్జునునిలోని నియత్రణ, ఇంద్రియ నిగ్రహం ఊర్వశిని ఆశ్చర్యచకితురాలిని చేయడమే గాక అతడిని అజేయుణ్ణి చేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: