కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి తొలి దర్శనం ఎవరికి , వారికే ఎందుకు అంత ప్రాధాన్యత . మీకు ఎవరికైనా తెలుసా.. సహజంగానే కొంతమందికి తెలిసే ఉంటుంది  ,కానీ చాలామందికి శ్రీవారి తొలి దర్శనం ఎవరు చేసుకుంటారు, వారే ఎందుకు చేసుకుంటారు  అని తెలియదు . ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం .

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం అంటే ఎవరికైనా ఆసక్తిగా ఉంటుంది  . మరి ఆ శ్రీవారిని తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి దక్కుతుంది . అది కూడా కేవలం ఒకటి , రెండు సార్లు కాకుండా జీవితాంతం వారే తొలి దర్శనం చేసుకుంటారు . ఇది వినడానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది కదా , వారే తొలి దర్శనం ఎందుకు చేసుకుంటారు.. ఎవరు వారు.. వారి చరిత్ర ఏమిటి. 
సూర్యోదయానికి ముందే పురోహితులు అభ్యంగన స్నానం చేసి , ఆలయ తలుపులు తెరచి  స్వామి వారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు . అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు . ఇది అన్ని సాధారణ ఆలయాల్లో జరిగే నిత్య కైంకర్యం . కానీ అసలు తిరుమల లో ఏం జరుగుతుంది . శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎలా ఉంటుంది , శ్రీవారి ఆలయానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది . తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది . అయితే ఎవరు తలుపులు తెరుస్తారు. తొలి దర్శనం ఎవరు చేసుకుంటారు .

ప్రతి రోజు కూడా ఓకే ఒకాయన తలుపులు తెరుస్తాడు . ఆయనే తొలి దర్శనం చేసుకుంటాడు . ఆ తొలి దర్శనం చేసుకునేది ఎవరు అంటే సన్నిధి గొల్ల అని చెప్తారు . ఎందుకలా అంటే మనం ఒకసారి తిరుమల చరిత్ర తెలుసుకోవాల్సి ఉంటుంది . ఎప్పటినుండో స్వామివారికి ఒక వ్యవస్థ ఉంది , ఆ వ్యవస్థలో భాగంగా స్వామి పరకామణిని ఒకరు చూస్తే , ఆలయాన్ని కొందరు చూసేవారు , పూజాది కార్యక్రమాలు అర్చకులు చూసుకుంటారు , ఇందులో భాగంగా స్వామివారి ఆలయ భద్రతలు గొల్లలు చూసేవారు .

ఉదయం ఆలయం తెరిచి రాత్రికి మళ్లీ ఆలయ తలుపులు మూసేసి వెళ్లేవారు . తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు . అలా నేటికీ ఆ బాధ్యతలను వారే నిర్వహిస్తున్నారు .
సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. అందుకే వీరిని సన్నిధి గొల్ల అని అంటారు . ఆనవాయితీగా ప్రతిరోజు సన్నిధి గొల్ల సూర్యోదయానికి ముందే మంచిగా స్నానం చేసి , దివిటీ చేతపట్టుకొని మూడు గంటల సమయంలో తాళాలు తీసుకుని ఆలయానికి బయలుదేరుతాడు.  అంతకుముందు అర్చకులు ఆయన ఇంటికి వెళ్లి  ,సన్నిధి గొల్ల ని  ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు .

అలా అందరూ కలిసి ఆలయం వద్దకు చేరుకుంటారు . అందరూ బయట నిలబడి ఉండగా  , సన్నిధి గొల్ల వెళ్లి ఆలయ తలుపులు తెరుస్తాడు . అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్లి జియాంగర్  స్వాములు వేద పండితులు కలిసి సుప్రభాతాన్ని పఠిస్తారు . ఆ సమయంలోనే సన్నిధి గొల్ల తలుపులు తెరుస్తాడు . దీనితో ఆయనకి శ్రీ వేంకటేశ్వర స్వామివారి తొలి దర్శనం లభిస్తుంది . ఆ తర్వాత అర్చకులు తమతో తీసుకు వచ్చి నటు వంటి పూజా సామాగ్రి తో లోనికి ప్రవేశించి , రాత్రి పవళింపు చేసిన బోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్తారు . ఆ తర్వాత అన్ని రకాల కైంకర్యాలను శ్రీవారికి జరుపుతారు . ఇలా శ్రీవారి తొలి దర్శనం సన్నిధి గొల్ల కి దక్కుతుంది . తిరిగి సన్నిధి గొల్ల రాత్రి తుది దర్శనం చేసుకొని.. తలుపులు వేసి తాళాలు తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్ళి పోతాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: