వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతీ గల్లీలో సందడి నెలకొంటుంది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలతో స్వామి వారిని కొలుస్తారు.గల్లీ గల్లీకో రకమైన వినాయకుడి విగ్రహం దర్శన మిస్తుం టుంది.ఇందుకోసం చాలా రకాల రూపాల్లో,ఆకర్షణీయ రంగుల్లో ఆ వినాయకుడిని రూపొందిస్తారు.ఇక హిందువులకున్న నమ్మక మేంటంటే గణపతిని తలచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా నిరాటకంగా సాగిపోతుంది అంటారు.ఇకపోతే ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితగా జరుపుకుంటాం.ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుని పూజిస్తారు. వీధులలో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు.



ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికి ఎంత భక్తిభావమో,తన భక్తులపై కూడా గణపతికి వల్ల మాలిన అభిమానం.ఆయన రూపం,నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి.సనాతన హిందూ ధర్మం ప్రకారం ఏ పని ప్రారంభించినా ముందుగా మంగళమూర్తి విఘ్నాధిపతిని ద్వాదశ నామాలతో అర్చించి మొదలు పెడతాం.సకల శుభకర మైన ఆ పన్నెండు నామాలు..1) సుముఖ 2) ఏకదంత 3) కపిల 4) గజకర్ణక 5) లంబోదర 6) వికటుడు 7) వినాయక 8) ధూమకేతు 9) గణాధ్యక్ష 10) పాలచంద్ర 11) గజానన 12) విఘ్నేశ్వరుడు.మొదలైనవి.



ఇక ఈ సారి ఈసారి బెంగళూరులో తయారుచేసిన కొబ్బరికాయల గణపతి అందర్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.9 వేల కొబ్బరి బొండాంలతో ఈ గణేషున్నిరూపొందించారు.బెంగళూరులోని పుట్టెంగలిలో ఏర్పాటు చేసిన ఈ గణపతిని 75 మంది వర్కర్లతో,20 రోజులు పాటు తయారు చేశారట. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి కాయలతో గణపతిని తయారు చేసినట్లు, గణపతి నిమజ్జనం తర్వాత ఈ కొబ్బరి బొండాలను భక్తులకు ప్రసాదంగా పంచనున్నామని నిర్వాహకులు తెలిపారు..ఏమైన ఈ తొమ్మిది రోజులు గణపతి దగ్గర ఆటపాటలో గడిపిన భక్తులు ఇక వెళ్లిరావయ్య గణపయ్య అంటూ నిమజ్ఞనం చేసే ఘట్టం చాలా అద్భుతంగా అనిపిస్తుంది...  


మరింత సమాచారం తెలుసుకోండి: