మాములుగా మనకు ఏదైన మొక్కువుంటే డబ్బు,బంగారం లేదా కొబ్బరికాయలో,పళ్లో,తలనీలాలో.కోడినో,మేకనో బలిచేస్తాం. కాని అలాంటివేవి లేకుండా ఓన్లీ వెజిటేబుల్లోని ఒక కాయ నైవేధ్యంగా పెట్టే ఆలయం గురించి.మీకు తెలుసా. అదేంటండి మేం అలాంటి ఆలయం గురించి వినలేదు.చూడలేదు.అసలు మీరుచెప్పే ఆలయం వుందా అని డౌట్ కదా. అలాంటి అను మానం మీకు కలగడం సహాజం ఎందుకంటే మనచుట్టూ వున్న ఆలయాల్లో కూరగాయల మొక్కు లాంటివి లేవు కాబట్టి.మన మొక్కుల్లో ఎక్కువ జంతు బలిలే వుంటాయి..కానీ ఓ ఆలయంలో మాత్రం సొరకాయలు మొక్కుబడిగా సమర్పిస్తారు.




ఇలాంటి ఆలయం ఎక్కడుందంటే చిత్తూరు జిల్లా,జనగణన పట్టణంలో నారాయణవనం ఉంది..ఇక ఈ ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుంటే పూర్వకాలంలో,చెన్నై, పుత్తూరు, కార్వేటినగరం, పచ్చికాపళ్లం ఇలా అన్ని వూర్లు సందర్శిస్తూ ఒక స్వామి చివరగా శ్రీవారి దర్శ నార్థం ఈ ప్రాంతానికి వచ్చి ఏడుకొండల వారిని దర్శించుకుని వెళ్లుతున్న సమయంలో నారా యణవనం కనిపించిందట. అక్కడి పరిసరాలు,ప్రకృతిలోని అందాలు ఎంతగానో నచ్చి ఇక తను వుండవలసిన ప్రదేశం ఇదే కాబోలని తలచి శ్రీమన్నా రాయణున్ని స్మరిస్తూ నిత్యం ధ్యానంలో వుండేవాడట.ఐతే ఆ స్వామి భుజాన ఎప్పుడు ఓ సొరకాయ సంచి వేలాడుతూ వుండేదట.ఎప్పుడైన భక్తులు అనారోగ్యంతో తనదగ్గరికి వస్తే తన భుజాన ఉన్న సొరకాయ నుంచి ఔషధాలు  అందించి ఆశీర్వదించేవాడట,




ఆ ఔషధం స్వీకరించిన వారికి ఎటువంటి రోగమైన నయం అయ్యేదట,అలా కొంతకాలానికి ఈ విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి పాకి ఆయన దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది.అలా ఈ స్వామి 200 ఏళ్లు పైగా జీవించినట్లు చెబుతారు.ఇక ఆయన జీవ సమాధి ఆనంతరం ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆలయంలో సొరకాయలు మొక్కుగా సమర్పించుకోవడం ఆనవాయితీగా మారిందట.సొరకాయ నుంచి ఔషధాలను తీసి రోగుల వ్యాధులు నయం చేసేవారు కాబట్టి కోరుకున్న కోర్కెలు నెరవేరినవారు, కోర్కెలు కోరుకున్నవారు సొరకాయలు ఆలయ ప్రాంగణంలో భక్తితో కడుతుంటారు.ప్రతి పౌర్ణమి,అమవాస్య రోజుల్లో తమిళనాడు రాష్ట్రం నుంచి కూడాపెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారట.ఇక ఈ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు.ఆయన దగ్గర ఉండే విద్యలేంటో తెలీదు.కాని మహాతపోశక్తివంతుడని స్దానికులు చెబుతుండేవారాట..


మరింత సమాచారం తెలుసుకోండి: