తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం సాగుతుందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనం రాష్ట్ర హైదరాబాద్ తో పాటు వ్యాప్తంగా ముఖ్యగట్టం. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనం కోసం అన్ని శాఖలను కలుపుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.  ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా నిమజ్జనం సాగిందన్నారు. గురువారం హైదరాబాద్ నగరంలో జరిగే నిమజ్జనం కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని మరి ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1లక్షకు పైగా గణేష్ విగ్రహాలను పెట్టారని చెప్పారు. గురువారం 50వేల గణేష్ నిమజ్జనం జరుగుతుందని డీజీపీ  వివరించారు.




గ్రేటర్ హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాలను కలుపుకొని 50 ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ తో పాటు మూడు కమిషనరేట్లు, డీజీపీ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందించారని.. దీనితో అన్ని శాఖలతో కలిసి నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలలో కలిపి 35 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. గణేష్ నిమజ్జనాన్ని గణేష్ మండపానికి చెందిన వాళ్ళతో కలిసి కొనసాగిస్తున్నామన్నారు. నిమజ్జనం పూర్తి అయ్యాక కూడా పోలీస్ కి సమాచారం ఇస్తారని చెప్పారు. గణేష్ నిమజ్జనం లో ప్రజలు సైతం భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజలందరూ నిమజ్జనం చూసేందుకు కూడా వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఎమర్జెన్సీ అవసరం కోసం ఆయా ఏరియాల్లో ట్రాఫిక్ రూట్స్ సైతం ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. నిమజ్జం పై ఎలాంటి రూమర్స్ క్రీయేట్ చేయొద్దు...అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు.






బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 100 సీసీటీవీలను ఏర్పాటు చేశామన్నారు. 24గంటలు నిమజ్జనం బ్రేక్ లేకుండా రన్ అవుతాయని చెప్పారు. కాగా  నిమజ్జనోత్సవం సందర్బంగా ట్రాఫిక్ నిబంధనలను విధించారు. హైదరాబాద్ నగర్ంలో సెప్టెంబర్ 12న గణేష్‌ శోభాయాత్రను పుర్కరించుకుని   ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వినాయకుడి శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని ..ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు సూచించారు. పాతబస్తీ నుంచీ ఊరేగింపుగా వచ్చే గణనాథులు, కేశవగిరి అలియాబాద్‌, నాగుల్‌చింత నుంచి వచ్చే విగ్రహాలు.. చార్మినార్‌, మదీన, అఫ్జల్‌ గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, మీదుగా లిబర్టీ, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ లేదా ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోవాలి. అలాగే టప్పాచబుత్ర అసిఫ్‌ నగర్‌ మీదుగా వచ్చే విగ్రహాలు సీతారాం బాగ్‌, బోయిగూడ కమాన్‌ మీదుగా గోషామహల్‌ అలస్కా నుంచి ఎంజే మార్కెట్‌ చేరుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: