రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే కాకుండా యావ‌త్ దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తోన్న బాలాపూర్ గ‌ణేష్ ల‌డ్డూ మ‌రోసారి రికార్డు బ్రేక్ చేసింది. ఈ యేడాది వేలం ప్ర‌క్రియ‌లో మొత్తం 28 మంది పాల్గొన్నారు. గ‌తేడాది కంటే రూ.ల‌క్ష‌కు ఎక్కువుగా వేలంలో రేటు ప‌లికింది. గ‌తేడాది ఈ ల‌డ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్నారు. ఈ యేడాది కొల‌ను రామిరెడ్డి గ‌తేడాది కంటే రూ. ల‌క్ష ఎక్కువకు పాడి సొంతం చేసుకున్నారు.


బాలాపూర్ గ్రామానికి చెందిన కొలన్ రామ్ రెడ్డి 17 లక్షల 60వేల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 1994 నుంచి ఈ గ‌ణేష్ ల‌డ్డూ వేలం కొన‌సాగుతుండ‌గా ప్ర‌తి యేడాది రేటు పెరుగుతూనే వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ లడ్డూ వేలం తొలిసారిగా 1994లో ప్రారంభమైంది. కొలను మోహన్ రెడ్డి రూ. 450కి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు.


ల‌డ్డూనూ వేలంలో పాడుకున్న వారు చాలా ప‌విత్రంగా భావిస్తుంటారు. ఈ ల‌డ్డూను పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం..మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ ల‌డ్డూ వేలంలో ఎక్కువ సార్లు కొల‌ను కుటుంబానికి చెందిన వారే ఎక్కువ సార్లు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే కుటుంబానికి చెందిన కొల‌ను రామిరెడ్డి ల‌డ్డూ ద‌క్కించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: