సాధార‌ణంగా మాంసాహారాలు తిని గుడికి వెళ్ల‌రు. ఇది మ‌న పూర్వీకులు నుండి వ‌స్తున్న ఆచారం. అలాగే గుడ్డు కానీ మాంసం కానీ తీసుకుంటే గణపతి మండపం దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు. మ‌రి దీని వెన‌క ఉన్న అస‌లు వాస్త‌వం చాలా మందికి తెల‌య‌క‌పోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే పూర్వీకుల నుండి వ‌స్తున్న ఆచారం క‌దా.. అని పాటిస్తారు. కానీ ఎక్క‌డో ఓ మూలు ఎందుకు మాంసాహారాలు తిని గుడికి వెళ్ల‌కూడ‌దు? అన్న ప్ర‌శ్న వ‌చ్చే ఉంటుంది. దానికి స‌మాదాన‌మే ఇది..!


గుడ్డు, మాంసం రజో గుణ, తమో గుణ సంబంధమైన పదార్థాలు. ఇవి మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోయి కామ వికార కోరికలు ఎక్కువగా కలుగుతాయట. దాని వలన మనిషి మంచి ఆలోచనల బదులు చెడు ఆలోచనలు రావడం జరుగుతుంది. గుడ్డు, మాంసం తిని గుడికి వెళ్లడం వలన మన మనసు ప్రశాంతగా ఉండక దేవుడి పై భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండదు. మానవుడు ఎప్పుడైనా తన మనశాంతి కొరకు దేవాలయం దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తాడు.


నిజానికి చాలా మంది ఉదయానే స్నానం చేసి ఎలాంటి పదర్థాలు తినకుండానే దేవాలయాలకు వెలుతుంటారు. దీంతో దేవాలయంలో మంచి ప్రశాంతత లభిస్తుంది. అయితే ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతగా ఉన్నప్పుడు ఏదైనా కోరికలు కోరుకుంటే దానికి పకృతి కూడా తోడై మన కోరికలు తీరుస్తుంది అంటారు. మనకు మంచి మనశాంతి దేవాలయంలో దొరుకుతుంది కాబట్టి.. మనం అక్కడికి గుడ్డు, మాంసం లాంటివి తిని వెళ్ళకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: