తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే మొదటి పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ.. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ    వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ ఆడబిడ్డలు ఆటపాటలతో సందడి సందడిగా జరిపారు. అందరూ ఎంతో కోలాహలంగా జరుపుకునే బతుకమ్మ ఆరోరోజు మాత్రం ఏ నైవేద్యం ఉండదు.  బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు.  అయితే దీని వెనుక ఓ చరిత్ర ఉందని చెబుతుంటారు పెద్దవాళ్లు... పూర్వకాలంలో ఆరవరోజు బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగిలిందని అది అపచారమని భావించిన బతుకమ్మను పేర్చరు. 

ఇక బతుకమ్మా.. అపచారం జరిగిపోయింది..మా అపచారాన్ని మన్నించు తల్లీ అంటూ వేడుకుంటారు. అంతే కాదు తల్లి నీ కోరికలన్నీ తీరుస్తాము.. మా మీద అలగవద్దు బతుకమ్మా..ఆగ్రహించవద్దు..నీ బిడ్డలం మమ్మల్ని కరుణించు..అని వేడుకుంటారు ఆడబిడ్డలు. ఆ రోజు అమ్మ అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. అందుకే ఆరవ రోజు బతుకమ్మను తయారు చేయరు.


మరింత సమాచారం తెలుసుకోండి: