దసరా నవరాత్రుల వేళ.. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు.. ఈ విషయం తెలిసిందే. మరి ఎందుకు అమ్మవారు ఇన్ని అలంకరణల్లో కనిపిస్తారు. వీటి వెనుక అంతరార్థం ఏంటి..? లోతుగా పరిశీలిస్తే.. అమ్మవారి వివిధాలంకారాలు మనిషిని దైవత్వం వైపుగా అడుగులు వేయించడానికి ఆ దైవం చేసిన ప్రయత్నమే అని చెప్పొచ్చు.


మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి.. చైతన్యాన్ని అంటే సూక్ష్మరూపంగాజీవునిలో ఉన్న ప్రాణశక్తి స్వరూపాన్ని తెలియజేయడం ఈ అలంకారం ఉద్దేశం. అంటే మనిషిలో నిద్రాణమై ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది.


ఇక మరో అవతారం గాయత్రి.. ఇది బుద్ధిశక్తిని ప్రచోదనం చేసే అవతారం. ఇక స్థూల శరీరప్రాధాన్యాన్ని విస్మరించకుండా సరైన ఆహారాన్ని అందించే అవతారం అన్నపూర్ణ.. ఇక లలితా అవతరానికి ఉద్దేశం ఏమింటంటే.. సమస్త సృష్టిలోని ఏకత్వాన్ని తెలియజేసిసమాజం పట్ల లాలిత్యాన్ని పెంపొందించడం.


మరి మహా లక్ష్మి అవతారం.. సంపదను పొందడం, పొందిన సంపదను లోకహితం కోసంవెచ్చించడం దీని ఉద్దేశం. అలాగే.. శ్లోకజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని కలిగించడానికి సరస్వతి అవతారం. దుర్గతిని రూపుమాపుకుని సుగతిని పొందడానికి దుర్గ అలంకారం.. దుష్టత్వనిర్మూలన కోసం మహిషాసుర మర్ధిని అవతారం ఉన్నాయి. యోగ్యతకు అనువైన స్థితిని కలిగించడానికి రాజరాజేశ్వరి అలంకారాన్ని ఆరాధిస్తాం. ఇలా ప్రాణులకు కావాల్సిన అన్నింటినీ కూడా దైవ స్వరూపాలుగా పేర్కొన్నారు మన పెద్దలు


మరింత సమాచారం తెలుసుకోండి: