దేవుడి ముందు అందరు సమానమే....కానీ దర్శనానికి మాత్రం విఐపి దర్శనాలు, ప్రత్యేక క్యూ లైన్లు పాటిస్తారు ఆలయ అధికారులు.ఇక వృద్దులు...పసి బిడ్డలకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తుంటారు.కానీ అనారోగ్యంగా ఉన్న ఒక విఐపి గారికి కూడా అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించారు బెజవాడ దుర్గమ్మ ఆలయ సిబ్బంది.అందరు విఐపిలను ఇలాగే చేస్తే భక్తులకు ఇబ్బంది కలగకుండా అలా చేసారని అనుకోవచ్చు....కానీ కొందరిని ఆదరిస్తూ...మరికొందరిని ఛీదరిస్తున్నట్టు ప్రవర్తించే తీరు చేసి సామాన్య జనాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత కృష్ణంరాజు దసర మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు కుటుంబంతో సహా ఆలయానికి వచ్చారు. అయితే, తనకు అనారోగ్యంగా ఉందని, ప్రత్యేక క్యూలైన్‌లో పంపాలని కృష్ణంరాజు కోరినా.. ఆలయ సిబ్బంది పట్టించుకోలేదు.దీంతో చేసేదేం లేక ఇతర భక్తులతోపాటు ఆయన కూడా క్యూలైన్లో నిల్చుని.. మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. ఆయాస పడుతూనే క్యూలైన్ నడిచిన ఆయన.. కుంకుమ పూజ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు.


తనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా.. దేవస్థాన సిబ్బంది పట్టించుకోలేదని కృష్ణంరాజు అసహనం వ్యక్తం చేశారు.అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనాలని, ఇందుకు సమాచారాన్ని దుర్గగుడి సిబ్బందిని అడిగినప్పటికీ వారు ఏమీ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ కేంద్రమంత్రి అయిన కృష్ణంరాజు పట్ల అధికారులు, సిబ్బంది ఇలా ప్రవర్తించడంపై ఆయన కుటుంబసభ్యులు, అక్కడున్న భక్తుులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబం కుంకుమ పూజలో పాల్గొని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోయారు.

ఇలా ఒక మాజీ కేంద్రమంత్రికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా ...అయన ఆరోగ్య స్థితిని అర్ధం చేసుకొని అధికారులు మాత్రం తరువాత వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  దుర్గ గుడి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి దుర్గమ్మను దర్శించుకున్నారు. 
 ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు దివ్యాశీర్వచనాలు అందించగా.. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. మరోవైపు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దర్శించుకున్నారు. సీఎస్‌కు వేదపండితులు ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. తొమ్మిదో రోజు కావడం ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి ఎక్కువగా కనిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: