కర్రలు లేచాయి. తలలు పగిలాయి. బన్నీ ఉత్సవం ఎప్పటిలాగే ఈసారి కూడా రక్తసిక్తమైంది. తరతరాల ఆచారమంటూ కొనసాగుతున్న ఈ వేడుక సంబరాల్లో 11 గ్రామాల ప్రజలు కర్రలతో యుద్ధం చేస్తారు. దసరా పండుగ రోజు కర్నూలు జిల్లా  దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం రణరంగం సుష్టిస్తుంది. అదే క్రమంలో ఈ విజయదశమికి కూడా ప్రజలు ఒక్క దగ్గర చేరి కర్రల సమరానికి సై అంటారు. ఆ క్రమంలో 60 మందికి పైగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. గాయపడ్డవారిని వెంటనే  ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.


కర్రలు చేతబట్టుకుని యుద్దానికి వెళుతున్నట్లుగా సిద్దమవుతారు  ప్రజలు అందరు. మరికొందరేమో దివిటీలు చేతబట్టి అర్ధరాత్రి పూట కొండల నడుమ దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయలుదేరుతారు. ఆ క్రమంలో ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోటీ పడతారు. అందులో భాగంగా కర్రలు గాల్లోకి లేస్తాయి. రాక్స క్రీడను తలపించేలా ఒకరినొకరు కొట్టుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ క్రమంలో తలలు పగలడం.. తీవ్ర గాయాలు కావడం పరిపాటిగా మారింది. ఇలాంటి రక్తపాతం వద్దని స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఎంత చెప్పినా ఇక్కడి ప్రజలు మాత్రం ఏమి పట్టించుకోరు . ఆనవాయితీ, ఆచారం పేరిట ప్రతిసారి రక్తపాతం జరుగుతుండటం మాత్రం క్యాయ్యాం.


బన్ని ఉత్సవం పేరిట జరిగే ఈ వేడుక ఇలా రక్తసిక్తం అవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దసరా అంటే జిల్లా వాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కర్రల సమరం గుర్తుకొస్తుంటుంది. అదే క్రమంలో ఈసారి కూడా మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు కూడా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ కర్రల సమరంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు పాల్కొంటారు. విజయదశమి సందర్భంగా స్వామి వారి కల్యాణత్సోవం అనంతరం కర్రల యుద్దం బీభత్సంగా జరిగింది. పదకొండు గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు.


ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా కర్నూలు జిల్లా దేవరగట్టు కొండ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కర్రల సమరం జరిగి నలుగురి పరిస్థితి విషమంగా మారింది. ఇక్కడ వెలసిన మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్దం జరగడం ఆనవాయితీగా వస్తోంది.  ఆ క్రమంలో ఈసారి కూడా కర్రల సమరంలో తీవ్ర గాయాలై నలుగురి పరిస్థితి విషమంగా తయారైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: