సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరే ఆ ఇల్లు కట్టుకోవాలి అనే కళను తీర్చుకోగలరు. అయితే పెద్దలు అంటుంటారు ఇల్లు నిర్మించిన పద్దతిని బట్టే అక్కడ నివాసముండే వారి భవిష్యేత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పగలం అని. ఆ పెద్దల మాటలు నిజమను వాస్తు కూడా చెప్తుంది. ఇంట్లో ఉండే మిగితా అన్ని గదులలా కాకుండా పూజ గది విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద తీసుకోవాలని వాస్తు కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేస్తోంది. 


ఆర్ధిక స్థోమత, మారుతున్న గృహ నిర్మాణ అవసరాలు, నగర ప్రాంతాల్లో పరిమితమైన స్థలంలోనే గృహ నిర్మాణం చేయాల్సి రావటం, అపార్టుమెంట్లలో నివసించాల్సి రావటం వంటి కారణాల వల్ల చాలామంది ప్రత్యేకంగా పూజగదికి తగినంత స్థలం కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూజాగదికి సంబంధించి వాస్తు ఏమి చెబుతోందో ఇక్కడ చదివి తెలుసుకోండి.


ఈశాన్య మూల ఈశ్వరునికి నిలయం గనుక ఆ మూల పూజ గది నిర్మాణానికి అత్యుత్తమమైన స్థానం.  


పూజగదిలో అనవసరపు బరువులు లేకుండా చూడటంతో పాటు ఎప్పుడూ పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి. 


ఈశాన్య గదిని పూజగదిగా వాడితే అందులో ఎత్తుగా సిమెంట్ పూజా పీఠం, మెట్లు కట్టరాదు. కలపతో చేసిన మందిరాన్ని లేదా పీటను పెట్టి దానిపై శుభ్రమైన వస్త్రాన్ని పరచి దేవుని ప్రతిమలు పెట్టుకోవాలి. 


ఈశాన్యాన పూజ గది నిర్మాణం కుదరనివారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో నిర్మించుకోవచ్చు. అదీ కుదరకపోతే వంటింటి ఈశాన్య మూల పూజా మందిరాన్ని పెట్టుకోవచ్చు. సరిపడా స్థలం ఉంటే మధ్యలో పూజ గదిని నిర్మించుకొని తగినంత ఖాళీ వదిలి నలువైపులా ఇంటినిర్మాణం చేసుకోవచ్చు.


సెల్లార్ లో గాలి, వెలుతురు ఉండవు గనుక అక్కడ పూజగది పనికిరాదు. అలాగే వృద్ధులు , పిల్లలకు అందుబాటులో ఉండదు గనుక పై అంతస్తుల్లో కూడా పూజగది నిర్మాణం అంత శ్రేయస్కరం కాదు.


పూజ గదిలో అటక నిర్మించి పాత సామానులు, బరువైన వస్తువులు పెట్టటం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను ఉంచరాదు. 


పూజగదికి ఎప్పుడూ రెండు తలుపులుండేలా చూడాలి. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: